Fish Pond: చేపలందు ఈ చెరువులోని చేపలే వేరు.. తండోపతండాలుగా తరలివస్తున్న జనాలు.. అసలు విషయం ఏంటంటే..
Fish Pond: సాధారణంగా నదుల్లో, సముద్రంలో భారీ చేపలు జాలర్లకు దొరుకుతుంటాయి. కానీ మంచి నీటి చెరువులో భారీ చేపలు దొరకడం...
Fish Pond: సాధారణంగా నదుల్లో, సముద్రంలో భారీ చేపలు జాలర్లకు దొరుకుతుంటాయి. కానీ మంచి నీటి చెరువులో భారీ చేపలు దొరకడం ఎప్పుడైనా చూశారా? మంచి నీటి చెరువులో మహా అయితే 10 నుంచి 15 కిలోలు ఉన్న చేపలు దొరకడమే అరుదు. అలాంటిది ఏకంగా 20 నుంచి 30 కిలోల బరువైన చేపలు దొరికితే! కానీ, ఇక్కడి చెరువులో ఎటు చూసినా అంతేస్థాయి చేపలు పట్టుబడుతున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెంలోని మంచినీటి చెరువులో 30 కిలోల బరువున్న చేపలు చిక్కి అందరినీ అశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
వీరన్నపాలెంలో మంచినీటి చెరువు ఉంది. అందులో సహజసిద్ధంగా పెరిగిన చేపలను మూడేళ్ల తర్వాత వేలం ద్వారా విక్రయించారు. పాటపాడుకున్న కాంట్రాక్టర్ జాలర్లతో చేపలు పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కసారిగా భారీ సైజులో చేపలు వలలో పడ్డాయి. 32 కిలోల వరకూ ఉన్న చేపలు పదికిపైగా దొరికాయి. చెరువులో చిక్కిన ప్రతి చేప కూడా పది కిలోలకు పైనే ఉండటం ఆశ్చర్యం. ముఖ్యంగా వీటిలో 30 కిలోలు ఉన్న చేపలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మంచినీటి చెరువుల్లో సహజసిద్ధంగా పెరిగే చేపల కంటే భిన్నంగా, దాదాపుగా ముప్పై కిలోల బరువు తో పాటుగా అతి పెద్ద పరిమాణం కలిగిన చేపలు వలలకు చిక్కుతుండటంతో గ్రామస్థులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
గ్రామంలో గడచిన ఐదు దశాబ్దాల కాలంగా మంచి నీటి చెరువులో చేపలు సహజ సిద్ధంగా పెరుగుతుంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం చెరువులోని చేపలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా భారీ పరిమాణంలో లభ్యం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని అంటున్నారు. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు.. చెరువులో పెద్ద మొత్తంలో చేపలు లభ్యం కావడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో వీరన్నపాలెం గ్రామస్తులతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సైతం పెద్ద చేపలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు వీరన్నపాలెం కు తరలి వస్తున్నారు.
Also read:
Dalai Lama’s Birthday: టిబెటన్ అధ్యాత్మిక గురువు దలైలామా గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం..
Sand Mafia: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బరితెస్తున్న సాండ్ మాఫియా.. పట్టించుకోని అధికారులు..
TRS vs Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..