పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం.. హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ బదిలీ.. మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పులు చేర్పులు జరిగాయి.

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం.. హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ బదిలీ.. మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
President Appoints New Governors
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 06, 2021 | 1:11 PM

President of India Appoints New Governors: కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పులు చేర్పులు జరిగాయి. దేశంలో 8 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గ‌వ‌ర్నర్లను నియ‌మించింది. హిమాచల్ ప్రదేశ్ గ‌వ‌ర్నర్‌గా ఉన్న బండారు ద‌త్తాత్రేయ‌కు స్థాన చ‌ల‌నం క‌లుగ‌గా, ఏపీ బీజేపీ నేత కంభంపాటి హ‌రిబాబును గ‌వ‌ర్నర్ ప‌ద‌వి వ‌రించింది. హిమాచ‌ల్ ప్రదేశ్ గ‌వ‌ర్నర్‌గా కొన‌సాగుతున్న బండారు ద‌త్తాత్రేయను హ‌ర్యానాకు బ‌దిలీ అయ్యారు. మిజోరం గ‌వ‌ర్నర్‌గా కంభంపాటి హ‌రిబాబును నియమితులయ్యారు.

ఇక, మ‌ధ్యప్రదేశ్ గ‌వ‌ర్నర్‌గా మంగూభాయ్ ఛ‌గ‌న్‌భాయ్ ప‌టేల్, క‌ర్నాట‌క గ‌వ‌ర్నర్‌గా థావ‌ర్ చంద్ గెహ్లోత్‌, గోవా గ‌వ‌ర్నర్‌గా పీఎస్ శ్రీధ‌ర‌న్ పిళ్లై, త్రిపుర గ‌వ‌ర్నర్‌గా స‌త్యదేవ్ నారాయ‌ణ‌, జార్ఖండ్ గ‌వ‌ర్నర్‌గా ర‌మేశ్ బైస్, హిమాచ‌ల్‌ప్రదేశ్ గ‌వ‌ర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Read Also…  Ramky Group: వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి.. సంస్థలు, ఇంట్లో ఐటీ సోదాలు.. 15 చోట్ల..