TRS vs Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..
TRS vs Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నకిరెకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై..
TRS vs Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నకిరెకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సాధికారిక ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఎవరైతే రాళ్లతో కొట్టమంటున్నారో వాళ్లనే ప్రజలు రాళ్లతో కొడతారని అన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీ శాసనసభ్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తే కదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటులో దొరికిన దొంగ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిపై లింగయ్య విరుచుకుపడ్డారు. ముందుగా పార్టీ మారిన రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలని కౌంటర్ అటాక్ ఇచ్చారు. స్పీకర్ కు దొంగ పత్రాలు ఇచ్చి వచ్చిడాంటూ ఫైర్ అయ్యారు.
హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలను, ధనవంతులను రేవంత్ రెడ్డి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం తెప్పించుకొని, వందల మందిని ఆఫీస్ బేరర్ లను పెట్టుకొని లక్ష రూపాయల జీతాలు ఇస్తున్నాడని రేవంత్‌పై నిప్పులు చెరిగారు. రియల్టర్లు ఎక్కడ వెంచర్లు వేస్తే అక్కడ, బిల్డర్లు ఎక్కడ బిల్డింగులు కడితే అక్కడ వాలిపోయి.. ఆ ప్రాజెక్టుల నుంచి, అధికారుల నుంచి వేల కోట్ల రూపాయలు దండుకున్నాడని రేవంత్ పై లింగయ్య సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్‌లో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారరు. గతంలో ఆయన ఏం చేశాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు.. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అందిరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. స్థాయికి మించి మాట్లాడితే ప్రజలే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతారని, తగిన సమయంలో తగిని విధంగా బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డికి లింగయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also read:
National Anthems: రికార్డు సాధించిన 17 ఏళ్ల కుర్రాడు.. 91 దేశాల జాతీయ గీతాలను అలవోకగా ఆలపిస్తూ..
Ramappa Temple: ప్రపంచ ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రామప్ప టెంపుల్.. యునెస్కో వారసత్వ పోటీకి ఎంపిక
Hyderabad: ఊరుకెళ్లిన కుటుంబ సభ్యులు.. అది గమనించిన ఆ యువకుడు ఏం చేశాడంటే..