ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ…జ్యోతిరాదిత్య సింధియా సహా నేతల ‘ఛలో ఢిల్లీ యాత్ర’..
ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో పదవులు కోరుతున్న ఆశావహులంతా ఛలో ఢిల్లీ యాత్ర చేపట్టారు. కొందరు నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకోగా మరికొందరు ఈ ఉదయం విమానాలు ఎక్కారు. గత ఏడాది మధ్యప్రదేశ్ లో...
ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో పదవులు కోరుతున్న ఆశావహులంతా ఛలో ఢిల్లీ యాత్ర చేపట్టారు. కొందరు నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకోగా మరికొందరు ఈ ఉదయం విమానాలు ఎక్కారు. గత ఏడాది మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం లో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియా ఇండోర్ నుంచి బయల్దేరారు. అంతకుముందు ఆయన ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో బాటు జనతా దళ్ నేత ఆర్ సి పీ సింగ్ కూడా ఉదయం హస్తిన చేరుకున్నారు. అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, బీహార్ లో లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ నుంచి పార్టీని ‘లాగేసుకుని తననే నేతగా ప్రకటించుకున్న ఆయన ‘అంకుల్’..పశుపతి కుమార్ పరాస్, మధ్యాహ్నం విమానమెక్కారు. ఇంకా దినేష్ త్రివేదీ, జితిన్ ప్రసాద, అప్నా దళ్ నేత అనుప్రియ పటేల్, పంకజ్ చౌదరి, రీటా బహుగుణ, వరుణ్ గాంధీ, రాహుల్ కాశ్వాన్, తదితరులంతా పోస్టుల కోసం ‘క్యూ’లో ఉన్నారు. తమకు మంత్రివర్గంలో నాలుగు ‘బెర్తులు’ కేటాయించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ అప్పుడే డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్ విస్తరణతో బాటు పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందని భావిస్తున్నారు. కొందరు మంత్రులు ఇతర శాఖలను కూడా అదనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వారి అదనపు శాఖలను కొత్తవారికి కేటాయించవచ్చు.
ప్రస్తుతం ఉన్న వారితో బాటు కేబినెట్ లో మరో 28 మంది మంత్రులను మోదీ తీసుకోవలసి ఉంటుంది. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను, 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని మోదీ తన కేబినెట్ కూర్పునకు పూనుకోవచ్చునని భావిస్తున్నారు. బెంగాల్ నుంచి ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పేరు కూడా వినిపిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.
Rare Snake Video: వైజాగ్ శేషాచలం అడవుల్లో బంగారు రంగు వర్ణంలో త్రాచు పాము…వైరల్ అవుతున్న వీడియో.