Auto-Rickshaw Race: చెన్నై రోడ్లపై ఆటో రేస్.. హడలిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..

Auto-Rickshaw Race: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆటో రేస్ కలకలం సృష్టించింది. ఈ భయానకమైన ఆటో రేస్‌కు సంబంధించిన వీడియోలు

Auto-Rickshaw Race: చెన్నై రోడ్లపై ఆటో రేస్.. హడలిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..
Auto Rickshaw Race
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Jul 06, 2021 | 4:30 PM

Auto-Rickshaw Race: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆటో రేస్ కలకలం సృష్టించింది. ఈ భయానకమైన ఆటో రేస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు కాస్తా పోలీసుల కంట పడటంతో చెన్నై పోలీసులు అలర్ట్ అయ్యారు. వీడియోల ఆధారంగా ఆటో రేస్‌లో పాల్గొన్న వారిని గుర్తించేపనిలో పడ్డారు పోలీసులు. ఆటో రేస్‌లో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం నాడు చెన్నై నగర శివార్లలోని తాంబరం నుంచి పోరూర్ వరకు హైవేపై ఆటో రేస్ నిర్వహించారు. అత్యంత ప్రమాదకరంగా నడుపుతూ ఆటో డ్రైవర్లు రేస్‌లో పాల్గొన్నారు. ఇలాంటి రేసులను ప్రత్యేకంగా ఆన్‌లైన్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రేస్‌లో గెలిచిన వారికి రూ. 10వేల బహుమతులు ఇస్తారట. కాగా, ఈ ఆటో రేస్ చూసి జనాలు సైతం హడలిపోయారు. రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్లేవారు, ఇతర ప్రయాణికులు ఈ రేస్‌ను హడలిపోయయారు.

2019లో ఇలాగే ఆటో రేసు నిర్వహించగా.. ఆటో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదొక్కటే కాదు.. అనేక మంది ఆటో రేసుల్లో ప్రాణాలు కోల్పోవడంతో ఆటో రేస్‌లపై పోలీసులు నిషేధం విధించారు. ఇప్పుడు మళ్లీ ఆటో రేసులు నిర్వహిస్తున్నట్లు వీడియోలు వెలుగు చూడటంతో పోలీసులు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ రేస్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిర్వాహకులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Viral Video:

 

Also read:

Boy Missing: అడవిలో తప్పిపోయిన బాలుడు.. 8వ రోజూ దొరకని ఆచూకీ.. డాగ్ స్క్వాడ్ సైతం..

AP Weather Report: ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. కీలక ప్రకనటన చేసిన అధికారులు..

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..