AP Weather Report: ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. కీలక ప్రకనటన చేసిన అధికారులు..
AP Weather Report: ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్, ఇంటీరియర్ ఒడిస్సాల మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టము నుండి 2.1 కిలోమీటర్ల
AP Weather Report: ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్, ఇంటీరియర్ ఒడిస్సాల మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టము నుండి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర ఒడిస్సా, పశ్చిమబెంగాల్ లలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందన్నారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు అమరావతి వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలోని కొన్ని చోట్ల ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక బుధవారం నాడు ఉత్తరకోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల.. భారీ వర్షాలు మరికొన్ని చోట్ల కురుస్తాయని తెలిపారు. గురువాం నాడు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు దక్షిణ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని చెప్పారు. అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. గురువారం నాడు కూడా అక్కడక్కడ వర్షాలు పడుతాయని చెప్పారు.
రాయలసీమ ప్రాంతంలోనూ దాదాపు ఇదేమాదిరిగా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. బుధవారం నాడు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే ఛాన్స్ ఉందన్నారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Also read:
Fish Pond: చేపలందు ఈ చెరువులోని చేపలే వేరు.. తండోపతండాలుగా తరలివస్తున్న జనాలు.. అసలు విషయం ఏంటంటే..