Governors: గవర్నర్లుగా రాణించిన మన తెలుగు వారు.. తాజాగా హరిబాబుతో పదికి చేరిన సంఖ్య. మిగతా వారెవరంటే.
Governors From Telugu States: దేశ రాజకీయాల్లో చెరిగిపోని గుర్తువేసిన వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. దేశ అత్యున్నత పదవులను ఆకర్షించారు మనవాళ్లు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులు..
Governors From Telugu States: దేశ రాజకీయాల్లో చెరిగిపోని గుర్తువేసిన వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. దేశ అత్యున్నత పదవులను ఆకర్షించారు మనవాళ్లు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులు గవర్నర్లుగా సేవలందించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తొమ్మిది మంది తెలుగు వారు పలు రాష్ట్రాల్లో గవర్నర్లుగా పదవులు చేపట్టారు. ఇక తాజాగా కేంద్రం మరోసారి పలు రాష్ట్రాల గవర్నలను మార్పులు చేర్పులు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే మరో తెలుగు వ్యక్తి కుంభం పాటి హరిబాబును మిజోరాం గవర్నర్‌గా నియమించారు. కంభంపాటి హరిబాబు 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చేశారు. 1991-1993 కాలంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా, ఆపై 1993-2003 మధ్య కాలంలో ఏపీలో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. 1999లో విశాఖపట్నం-1 నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మార్చి 2014లో బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా గెలుపొందారు.
హరిబాబు గవర్నర్‌గా నియమితులైన నేపథ్యంలో ఇప్పటి వరకు గవర్నర్‌గా సేవలందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుల వివరాలు ఓసారి చూద్దాం.
1) బండారు దత్తాత్రేయ (హిమాచల్‌ప్రదేశ్, హర్యానా) 2) సీహెచ్ విద్యాసాగర్‌రావు (మహారాష్ట్ర, 1 సం. తమిళనాడు అదనపు బాధ్యతలు) 3) రోశయ్య (తమిళనాడు) 4) విఎస్ రమాదేవి (హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక) 5) వి రామారావు (సిక్కిం) 6) కోన ప్రభాకరరావు (పాండిచ్చేరి, మహారాష్ట్ర) 7) మర్రి చెన్నారెడ్డి (యూపీ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు) 8) కేవీ కృష్ణారావు (కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర) 9) పెండేకంటి వెంకట సుబ్బయ్య (బీహార్, కర్ణాటక)
అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్..
మిజోరాం గవర్నర్‌గా నియమితులైన కుంభంపాటి హరిబాబుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలను తెలిపారు. ఎంపీగా, ఎమ్మేల్యేగా.. విద్య, వైద్యం, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాలపై దృష్టిసారించిన హరిబాబు అనుభవం మిజోరంలో ఎంతో దోహదపడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇక హర్యానా గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు పవన్. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్‌కు సేలందించిన ఆయన.. ఇకపై హర్యానా రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read: AP News: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!
ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ…జ్యోతిరాదిత్య సింధియా సహా నేతల ‘ఛలో ఢిల్లీ యాత్ర’..
Apple Watch: ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు.. ముందే హెచ్చరించిన ఆపిల్ వాచ్..!