అరెస్టు చెయ్యరన్న గ్యారంటీ ఉంటే యూపీ పోలీసుల ముందు హాజరవుతా…ట్విట్టర్ ఇండియా ఎండీ
తనను అరెస్టు చెయ్యరనే గ్యారంటీ ఉంటే తాను యూపీలోని పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరవుతానని ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి అన్నారు. ఈ మేరకు ఆయన కర్ణాటక హైకోర్టులో తన వాదన వినిపిస్తూ...తనను అరెస్టు చేయకుండా చూడాలని వారిని ఆదేశించాలని కోరారు.
తనను అరెస్టు చెయ్యరనే గ్యారంటీ ఉంటే తాను యూపీలోని పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరవుతానని ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి అన్నారు. ఈ మేరకు ఆయన కర్ణాటక హైకోర్టులో తన వాదన వినిపిస్తూ…తనను అరెస్టు చేయకుండా చూడాలని వారిని ఆదేశించాలని కోరారు. లోనీ అనే ముస్లిం వృద్దుని కేసుకు సంబంధించి ఘజియాబాద్ పోలీసులు ఆయనకు ఇదివరకే నోటీసు జారీ చేశారు. అయితే తన వాదనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని ఆయన కోరుతున్నారు. ఈమేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఈ మధ్యే దీన్ని విచారించిన కోర్టు.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆయనను వ్యక్తిగతంగా కాకుండా వర్చ్యువల్ గా విచారించాలని పోలీసులకు సూచించింది. అయితే ఈ ఆదేశాలను పోలీసులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాను కేవలం ట్విటర్ ఇండియా ఉద్యోగినని, తమ డైరెక్టర్లు వేరే ఉన్నారని మనీష్ మహేశ్వరి పేర్కొన్నప్పటికీ ఘజియాబాద్ పోలీసులు దీన్ని కూడా సవాలు చేశారు. ఈ కంపెనీకి ముఖ్యంగా ఇండియాలో ఈయనే ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఖాకీలు పేర్కొన్నారు. ఈ సంస్థకు ఆయన హెడ్ అని. అందుకే ఆయనకు నోటీసు జారీ చేశామని అన్నారు.
ఇలా ఉండగా ట్విట్టర్లో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ ఉందంటూ జాతీయ మహిళా హక్కుల కమిషన్ కూడా ఆరోపించింది. ఈ మేరకు ఈ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఢిల్లీ పోలీసులకు పంపిన లేఖలో పేర్కొన్నారు., దీంతో వారు కూడా ఈయనపై కేసు పెట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి : Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.
Rare Snake Video: వైజాగ్ శేషాచలం అడవుల్లో బంగారు రంగు వర్ణంలో త్రాచు పాము…వైరల్ అవుతున్న వీడియో.