AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court : పూరీ మినహా ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రకు అనుమతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court :రథయాత్రను పూరీ జగన్నాథ ఆలయంలోనే కాకుండా ఒడిశా లోని అనేక నగరాల్లో నిర్వహించడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరణాలు (కోవిద్) ఎక్కువగా ఉన్నాయని..సీజేఐ జస్టిస్ ఎన్ .వి.రమణ నేతృత్వంలోని

Supreme Court : పూరీ మినహా ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రకు అనుమతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు
Odisha Ratha Yatra
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 06, 2021 | 6:13 PM

Share

Supreme Court :రథయాత్రను పూరీ జగన్నాథ ఆలయంలోనే కాకుండా ఒడిశా లోని అనేక నగరాల్లో నిర్వహించడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరణాలు (కోవిద్) ఎక్కువగా ఉన్నాయని..సీజేఐ జస్టిస్ ఎన్ .వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రథయాత్రకు అనుమతించలేమని బెంచ్ స్పష్టం చేసింది. కోవిద్ ఆంక్షలు, ప్రొటొకాల్స్ తో ఈ యాత్రను పూరీ జగన్నాథ ఆలయంలో నిర్వహించుకోవచ్చునని ఒడిశా ప్రభుత్వం ఇదివరకటి తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ కార్యక్రమాన్ని మొత్తం అన్ని నగరాల్లో నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ దారులు…. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తమ పిటిషన్లలో అభ్యర్థించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ ఎన్వి. రమణ అన్నారు. తానుకూడా ఇందుకు విచారిస్తున్నానని, కానీ మీకు సాయపడలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. పూరీలో మాత్రం నిర్వహించుకోవచ్చునన్నారు. భగవంతుడు అనుమతిస్తే వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర జరగవచ్చునని ఆయన చెప్పారు.

లోగడ కోవిద్ పాండమిక్ ముందు లక్షలాది భక్తులు, యాత్రికులతో జగన్నాథ రథయాత్ర కోలాహలంగా సాగేది.దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ యాత్రలో పాల్గొనేవారు. అయితే.. ఈ ఏడాది కూడా కోవిద్ కారణంగా రథయాత్ర పరిమితంగా పూరీలోనే నిర్వహించాల్సి వస్తోంది. సుప్రీంకోర్టులోనైనా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశించిన పిటిషన్ దారులు ..ఈ ఉత్తర్వులతో డీలా పడిపోయారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఒట్టి చేతులతో వెనక్కి ఎందుకు.. చెప్పులు ఎత్తికెళ్తే పోలా..? దొంగతనంకు దర్జాగా లిఫ్ట్ లో వచ్చిన దొంగ..(వీడియో):Viral Video.

 ఫుట్ బాల్ పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి పెళ్లి ప్రపోజల్..!హోరెత్తిన స్టేడియం..వైరల్ అవుతున్న వీడియో..:Proposal on pitch video.

Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్‌ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.

 ఖమ్మం ఆలయంలో దేవత విగ్రహం పై నాగుపాము ప్రత్యక్షం..అమ్మవారి మహత్యం..!వైరల్ వీడియో :snake on the idol of god video.