AP News: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి..

AP News: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!
Follow us

|

Updated on: Jul 06, 2021 | 4:30 PM

ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2021-22 విద్యాసంవత్సరం ప్రారంభంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా కారణంగా 2021-22 విద్యా సంవత్సరం ఆగిపోకుండా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. క్లాసులు జరగకుండా ఫీజులు వసూలు చేస్తున్న వారిపై నియంత్రణ కమిటీ చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అధిక ఫీజులు వసూళ్లు చేసేవారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అమ్మఒడిలో భాగంగా విద్యార్ధులకు ట్యాబ్‌లు.. అలాగే విద్యాదీవెన్ వద్దనుకున్న వారికి ల్యాప్‌ట్యాప్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు సుమారు 10 లక్షల మంది ముందుకు వచ్చారని స్పష్టం చేశారు.

కాగా, గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసిందని మంత్రి దుయ్యబట్టారు. పేదరికం విద్యకు అడ్డుకాకూడదనే విధంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పాఠశాల స్థితిగతులను మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఐదు యూనివర్సిటీలను దేశంలోనే టాప్ 10లో ఉంచే విధంగా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను మార్కెట్‌లో అమ్మి భ్రష్టు పట్టించిందని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు.

విద్యాశాఖ మంత్రి కాన్వాయ్ అడ్డగింత…

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని విద్యార్థి,యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్‌ను అడ్డగించిన యువజన సంఘాల నాయకులు తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని విద్యార్థి,యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు.

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.