AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Drones: శ్రీశైలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లు..! అసలు విషయం అదేనా..!

విశ్వాన్ని లయం చేసే ముక్కంటి క్షేత్రంపై మూడో కన్నా?.. త్రినేత్రుడి సన్నిధిపై కెమెరా కన్ను.. ఎవరి పని? ఎందుకు? ఆకాశ వీధిలో అల్లంత ఎత్తున.. మిణుకు మిణుకుమంటున్న ఈ కాంతులే కలకలానికి కారణం.. అవి డ్రోన్లేనా..? కొత్త అనుమానం..

Srisailam Drones: శ్రీశైలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లు..! అసలు విషయం అదేనా..!
Srisailam Drones
Sanjay Kasula
|

Updated on: Jul 06, 2021 | 5:07 PM

Share

విశ్వాన్ని లయం చేసే ముక్కంటి క్షేత్రంపై మూడో కన్నా?.. త్రినేత్రుడి సన్నిధిపై కెమెరా కన్ను.. ఎవరి పని? ఎందుకు? ఆకాశ వీధిలో అల్లంత ఎత్తున.. మిణుకు మిణుకుమంటున్న ఈ కాంతులే కలకలానికి కారణం.. అవి డ్రోన్లు అని మొదట గుర్తించారు. కానీ వాటిని ఎవరు ఆపరేట్‌ చేస్తున్నారో.. ఎందుకో మాత్రం పసిగట్టలేదు… పసిగట్టడం ఓ సవాల్‌గా మారిందిప్పుడు. గత వారం క్రితం రామారావు అనే స్థానికుడు డ్రోన్లను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరు ఆపరేట్‌ చేస్తున్నారో పసిగట్టేందుకు రంగంలోకి దిగారు. కానీ మిణుకు మిణుకు కాంతులే కన్పిస్తున్నాయి తప్ప.. వీటిని నడిపిస్తున్నదెవరో క్లూ దొరకడంలేదు.

 నాలుగు రోజుల్లో మూడు రోజులు ఆకాశంలో కనిపించిన ఆకారాలు డ్రోన్లా కాదా..? అనే అనుమానాలు కూడా ఉన్నాయని పోలీసులు అంటున్నారు. డ్రోన్‌ ఆపరేషన్‌ ఎవరి పని? ఎందుకు?.. టెక్నో పోలీసింగ్‌ ఎందుకని ఆ మిస్టరీ చేధించలేకపోతోంది? శ్రీశైలంలో డ్రోన్ల చక్కర్ల వెనుక గుప్తనిధుల ముఠాలున్నాయా..? గ్యాంగ్ మెంబర్లు నిధుల వేట కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్నారా..? లేదంటే డ్రోన్లను అకాశంలోకి వదిలేసి డైవర్ట్ చేస్తున్నారా..? ఓవైపు డ్రోన్లు నింగిలో చక్కర్లు కొడుతుంటే.. ఇంకోవైపు ఆలయాల పరిసరాల్లో తవ్వకాలు ఎందుకు జరుగుతున్నాయి..? ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది.

ఇదిలావుంటే.. శక్తిపీఠం, జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైల ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లుగా గతంలోనే నిఘావర్గాలు హెచ్చరించాయి. తాజా ఘటనల నేపథ్యంలో టెర్రర్‌ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే సోమవారం రాత్రి నుంచి పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు కర్నూలు పోలీసులు. డ్రోన్‌ నిపుణులతో కలిసి స్థానిక ఎస్పీ ఫకీరప్ప స్వయంగా రాత్రంతా అక్కడే ఉన్నారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. ఇక ఈ రోజు కూడా భద్రతను మరింత పెంచుతున్నట్లుగా ఎస్పీ తెలిపారు. భక్తులకు భయాలు పోయే వరకు శ్రీశైలంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఎస్పీ. ఆకాశంలో కనిపిస్తున్న డ్రోన్ ఆకారాలు కోసం ఈరోజు రాత్రి మరోసారి టెక్నీకల్ టీమ్‌తో కలిసి పోలీసుల పరిశీలిస్తారని తెలిపారు.

ఇవి కూడా చదవండి: Sonu Sood-KTR: మంత్రి కేటీఆర్‌ను కలిసిన రియల్ హీరో సోనూ సూద్‌.. ఫోటోలు చూడండి..

Lockdown: మళ్లీ విరుచుకుపడిన కరోనా రక్కసి.. ఆ రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్

PMFBY: మీ పంట రక్షణ కోసం ఆందోళన చెందుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!