ఆటోలో ఫోర్న్ వీడియోలు చూస్తూ యువకుడి అసభ్య ప్రవర్తన.. చెప్పులతో కొట్టిన ఇద్దరు అమ్మాయిలు..
Madhya Pradesh : ఆటోలో కూర్చున్న యువకుడు ఫోర్న్ వీడియోలు చూస్తూ ఇద్దరు అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించాడు.

Madhya Pradesh : ఆటోలో కూర్చున్న యువకుడు ఫోర్న్ వీడియోలు చూస్తూ ఇద్దరు అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆగ్రహించిన అమ్మాయిలు అతడిని చెప్పులతో కొట్టిన సంఘటన మద్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పనిచేసే ఇద్దరు అమ్మాయిలు విధులను ముగించుకొని ఆటోలో ఇంటికి బయలుదేరారు. మద్యలో వచ్చిన స్టాప్ దగ్గర ఓ యువకుడు ఆటో ఎక్కాడు.
అమ్మాయిల పక్కన కూర్చొని సెల్‌ఫోన్‌లో ఫోర్న్ వీడియోలు చూడటం ప్రారంభించాడు. ఇది గమనించిన అమ్మాయిలు వింతగా భావించారు. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉన్నారు. అయితే కొద్దిసేపటికి ఆ యువకుడు రెచ్చిపోయాడు. అమ్మాయిల చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న వారు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. ఫుల్‌బాగ్ కూడలి వద్ద ఆటోని ఆపారు.
ఆ యువకుడి వెంట్రుకలు పట్టుకొని ఆటో నుంచి బయటికి లాగారు. చెప్పులతో కొట్టడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు గుమిగూడారు. వెంటనే ఆ యువకుడు రెండు చేతులతో దండం పెడుతూ ఆ ఇద్దరు అమ్మాయిలను క్షమించమని కోరాడు. ప్రజలు గుమిగూడటంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకున్న కొంతమంది చిన్నా పెద్దా తేడా లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. సభ్యసమాజానికి తలవొంపులు తీసుకొస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరగుతూనే ఉన్నాయి. వీటిని ఆపాలంటే మహిళలు, యువతులు ధైర్యంగా పోరాడాలి.