Taxes on Bitcoin: మీరు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడుతున్నారా..! టాక్స్ ఎలా చెల్లించాలో తెలసుకోండి..!

భారతదేశంలో బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ఇందులో ఖర్చు చేస్తున్నారు.

Taxes on Bitcoin: మీరు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడుతున్నారా..! టాక్స్ ఎలా చెల్లించాలో తెలసుకోండి..!
Bitcoin
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 06, 2021 | 7:25 PM

భారతదేశంలో బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ఇందులో ఖర్చు చేస్తున్నారు. ఎక్కడో ఉన్న బిట్‌కాయిన్ విలువ ఇవాళ అనేక లక్షల రూపాయలకు చేరుకుంది. చాలా మంది దీనిని కొనుగోలు చేసి.. అమ్మడం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో పన్నుకు సంబంధించిన నియమాలను తెలుసుకోవాలి. పన్నులు దాఖలు చేసేటప్పుడు, బిట్‌కాయిన్ లేదా ఈథర్ వంటి డిజిటల్ కరెన్సీ నుండి ఎంత ఆదాయం సంపాదిస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. అప్పుడు మీరు కూడా తదనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇలా చేయకుంటే మీపై ఐటీ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది.

క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతున్నవారిలో చాలా ప్రశ్నలున్నాయి.  బిట్‌కాయిన్ ద్వారా ఆర్జించిన సంపాధనను ఎవరి పేరుతో చూపించాలి..? దానిపై ఎంత పన్ను ఉంటుంది..? ఎలా చెల్లించాలి..? ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ ఇంకా స్పష్టమైన సూచనలు ఇవ్వనందున ప్రజలకు ఇలాంటి చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయి. క్రిప్టోకరెన్సీకి సంబంధించి ఆదాయపు పన్ను ఇంకా ఎటువంటి నిబంధనలను స్పష్టం చేయలేదు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు ఎలా, ఎప్పుడు, ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందో తెలుసుకోవాలనుకుంటారు. ఈ విషయంలో పెట్టుబడిదారులు స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక శాఖను కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో పెట్టుబడి పెట్టే వ్యక్తి దానిని స్వయంగా అర్థం చేసుకోవాలి. పన్ను చెల్లించాలి.. లేదా ఆడిటర్‌ను సంప్రదించిన తరువాత పన్ను చెల్లించడం బెటర్.

IT నియమం ఏమిటి..

వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే పన్ను రహితమని ఆదాయపు పన్ను చట్టం చెబుతోంది. మిగతా అన్ని రకాల ఆదాయాలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా బిట్‌కాయిన్ లేదా మరేదైనా క్రిప్టోకరెన్సీ నుండి సంపాదిస్తే వారు తప్పనిసరిగా టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఒక పెట్టుబడిదారుడు క్రిప్టో ట్రేడింగ్ చేస్తే, అతని ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు… తదనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  మూలధన లాభాల ఆధారంగా పన్ను విధించబడుతుంది. ఇందుకోసం లాభం, నష్టం ఖాతా, బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలి.

ఎంత పన్ను చెల్లించాలి…

మూడు సంవత్సరాల తరువాత తన క్రిప్టోకరెన్సీ పెట్టుబడులను  విక్రయిస్తే అతనికి దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను విధించబడుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలకు 20 శాతం పన్ను విధించబడుతుంది. మీరు 3 సంవత్సరాల ముందు బిట్‌కాయిన్‌ను విక్రయిస్తే.. స్వల్పకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను విధించబడుతుంది. కొనుగోలు, అమ్మకాల మధ్య ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు కట్టాల్సిన టాక్స్ మారిపోతుంది. అటువంటి పరిస్థితిలో అతను వ్యాపారంగా మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసి, చాలా సంవత్సరాల తరువాత విక్రయిస్తుంటే అది పెట్టుబడి వర్గంలోకి వస్తుంది. అదే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

బిట్‌కాయిన్ వ్యాపారం..

ప్రభుత్వ నోటిఫికేషన్‌లో బిట్‌కాయిన్‌లో వ్యాపారం చేయడం వ్యాపార ఆదాయంగా కనిపిస్తుంది. దీనిపై టాక్స్ వివిధ రకాలుగా  పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బిట్‌కాయిన్ వ్యాపారం చేసే వారు తమ పన్ను స్లాబ్‌ను తెలుసుకొని ఆదాయపు పన్ను చెల్లించవచ్చు. బిట్‌కాయిన్ ద్వారా సంపాదించిన డబ్బు ఎవరి చేతుల్లోకి వెళుతుందో అతను పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం సంపాదించే వ్యాపారం లేదా వృత్తి ప్రకారం పన్ను విధించబడుతుంది. ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టమైన సూచనలు లేనప్పటికీ మీరు సంపాదిస్తుంటే, పన్ను చెల్లించే నియమం దానిపై ఖచ్చితంగా వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి: Sonu Sood-KTR: మంత్రి కేటీఆర్‌ను కలిసిన రియల్ హీరో సోనూ సూద్‌.. ఫోటోలు చూడండి..

Lockdown: మళ్లీ విరుచుకుపడిన కరోనా రక్కసి.. ఆ రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్

PMFBY: మీ పంట రక్షణ కోసం ఆందోళన చెందుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!