కరణ్ డైరెక్షన్లో మరో అందమైన ప్రేమ కథ.. రణవీర్ అలియా జంటగా రానున్న సినిమా..

కరణ్  డైరెక్షన్లో మరో అందమైన ప్రేమ కథ.. రణవీర్ అలియా జంటగా రానున్న సినిమా..
Rocky Aur Rani Ki Prem Kaha

Rocky Aur Rani Ki Prem Kahani: రియల్ ప్రేమికులు ప్రేమ.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిషృతమైతే ఎలా ఉంటుంది.. సూపర్‌ గా ఉంటుంది కదా..! అదే ప్రేమకథని సెన్సబుల్ సినిమాల స్పెషలిస్టు కరన్‌ జోహార్‌ తెరకెక్కిస్తే

Rajeev Rayala

|

Jul 06, 2021 | 6:41 PM

Rocky Aur Rani Ki Prem Kahani: రియల్ ప్రేమికులు ప్రేమ.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిషృతమైతే ఎలా ఉంటుంది.. సూపర్‌ గా ఉంటుంది కదా..! అదే ప్రేమకథని సెన్సబుల్ సినిమాల స్పెషలిస్టు కరన్‌ జోహార్‌ తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది.. మరో “దిల్ వాలే దుల్హనియా లేజేయేంగే” లా ఉంటుంది కదా..! ఇప్పుడు బీటౌన్‌ మీడియా కూడా ఇదే లైన్‌తో ఆర్టికల్స్‌ రాస్తూ తెగ హంగామా చేస్తోంది. అదంతా ఓకే కాని.. ఇంతకీ ఆ రియల్ ప్రేమికులు ఎవరాని అనుకుంటున్నారు కదా.. శక్తి నిత్యత్వ నియమాన్ని పాటిస్తూ బీటౌన్‌లో ఇష్టమచ్చినట్లుగా తిరిగే ప్రేమ.. ఇటీవల రణ్‌బీర్ కపూర్ అలియా ఒంట్లో కూడా దూరి.. వాళ్లను చెట్టాపట్టాలేసుకుని మరీ తిరిగేలా చేసింది. అలా చేయడమే కాదు ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూ.. ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో రూమర్లను కూడా పుట్టించింది.

ఇక దీంతో మా మధ్య ప్రేమ గీమా లాంటిది లేదంటూ.. పకడ్భందీగా స్క్రిప్ట్స్‌ రాసుకుని మరీ మీడియాకు చెప్పిన ఈ జంట.. చివరికి ఒకరికి కరోనా వస్తే.. మరొకరు టెస్ట్‌ చేసుకుంటూ దొరికిపోయి.. సిగ్గుతో కూడిన నవ్వు నవ్వుతూ బీటౌన్‌ కెమెరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.  ఇక ఇవన్నీ గమనిస్తూ వచ్చిన బాలీవుడ్ సూపర్‌ మ్యాన్ కమ్‌ డైరెక్టర్‌ కరణ్ జోహర్.. రణ్‌బీర్‌ కపూర్‌ అలియాల మధ్య జరిగిన రియల్ లవ్‌ సీన్లకు తన రైటింగ్ స్టైల్ని యాడ్ చేసి “ప్రేమ్‌ కహాని” పేరుతో ఓ స్క్రిప్ట్ ను రాసుకున్నారట. అయితే ఈ స్ట్రీప్ట్లో కపూర్‌కు బదులు రణ్‌వీర్ సింగ్ను హీరోగా తీసుకుని అలియాతో ప్రేమలోకి దించనున్నారట. నున్నారటే కాదు… తాజాగా దించాడు కూడా… అవును నిన్న మొన్న వరకు ఓ అప్‌డేట్ అంటూ ఊరించిన కరణ్… తాజాగా “రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ” అనే టైటిల్ను అనౌన్స్‌ చేశారు. ఈ టైటిల్ తోనే మరో క్రేజీ లవ్ స్టోరీని మీముందుకు తీసుకువస్తానంటున్నారు. ఇక ఇప్పటికే “గల్లీ బాయ్స్‌” సినిమాలో ఈ జంట మెస్మరెజింగ్ లవ్‌ చూపించిన కారణంగా కరణ్‌ ఈ ఆలోచన చేశారట. ఇక ఈ సినిమాతో అలియా దిల్ ని ఎలా ఆవిష్కరించబోతున్నారో చూడాలి మరి!

మరిన్ని ఇక్కడ చదవండి :

Singer Sunitha: మధురమైన గాత్రం.. చూడచక్కని రూపం.. వైరల్ అవుతున్న సింగర్ సునీత పోస్ట్..

Pawan Kalyan : పవన్ కాన్వాయ్ ను ఛేజ్ చేసిన ఫ్యాన్స్.. ఆ తర్వాత పవర్ స్టార్ట్ ఏం చేశాడో తెలుసా..

Chiranjeevi: ఆచార్య షూటింగ్ రీస్టార్ట్ .. చకచకా షూటింగ్ కంప్లీట్ చేయనున్న మెగాస్టార్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu