AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad City Bus: హైదరాబాద్‌ మహిళలకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై మీకు నచ్చిన చోట బస్సు ఆపుకోవచ్చు. కుదరదంటే నడవదు.

City Bus Hyderabad: తెలంగాణ ఆర్టీసి హైదరాబాద్‌ మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సిటీ బస్సులు కేటాయించిన బస్‌ షెల్టర్ల వద్ద మాత్రమే ఆగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీని వల్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి...

Hyderabad City Bus: హైదరాబాద్‌ మహిళలకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై మీకు నచ్చిన చోట బస్సు ఆపుకోవచ్చు. కుదరదంటే నడవదు.
Hyderabad City Police
Narender Vaitla
|

Updated on: Jul 06, 2021 | 5:43 PM

Share

City Bus Hyderabad: తెలంగాణ ఆర్టీసి హైదరాబాద్‌ మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సిటీ బస్సులు కేటాయించిన బస్‌ షెల్టర్ల వద్ద మాత్రమే ఆగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీని వల్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. బస్‌ షెల్టర్‌కు తాము వెళ్లాల్సిన ప్రదేశానికి మధ్య దూరం ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు ఇంటికి చేరుకునే వర్కింగ్ ఉమెన్స్‌కు ఇదొక సవాలుగా చెప్పవచ్చు. దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే టీఎస్‌ ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి 7.30 దాటిన తర్వాత మహిళలు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆగేలా, అలాగే వారు కోరుకున్న చోట దిగేలా చర్యలు తీసుకుంది.

ఈ క్రమంలోనే మహిళా ప్రయాణికులు కేవలం బస్‌ స్టాపుల్లోనే కాకుండా తమకు ఇష్టమైన చోట దిగే వెసులుబాటును కలిపించింది. బస్సు డ్రైవర్లు దీనిని తూచాతప్పకుండా పాటించాలని అధికారులు ఆదేశించారు. ఈ కొత్త విధాన్ని ఆర్టీసీ మంగళవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఒకవేళ మహిళా ప్రయాణికులు తాము కోరుకున్న చోట బస్సు ఆపకపోతే వెంటనే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయమై ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్లను ఆదేశించారు. మహిళలు ఎక్కువ సమయం బస్టాపుల్లోనే వేచి ఉండకుండా.. బస్సు కోసం ప్రత్యేకంగా బస్టాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకావం కల్పించినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విధానం అమల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 99592 26160, 9959226154 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. దీంతోపాటు.. ముఖ్యమైన బస్టాపుల్లో రాత్రి 10 గంటల వరకు బస్సుల నియంత్రణ అధికారులుండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక అంతేకాకుండా ఏపీ ఉద్యోగుల ప్రత్యేక రైలు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించడంతో.. అందులో వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని వెంకటేశ్వర్లు తెలిపారు.

Also Read: Viral News: టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!

Srisailam Drones: శ్రీశైలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లు..! అసలు విషయం అదేనా..!

Golgappa Bride: పెళ్లిపీటల మీద పూల దండలకు బదులు పానీ పూరీలను ధరించిన నవ వధువు.. సోషల్ మీడియాలో వైరల్