AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కరెన్సీ నోట్లపై ప్రధాని మోడీ బొమ్మ వేస్తారేమో.. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ కౌంటర్

కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ (Telangana) గవర్నమెంట్ మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు అందించడం లేదని ఆరోపిస్తుంటే..

Telangana: కరెన్సీ నోట్లపై ప్రధాని మోడీ బొమ్మ వేస్తారేమో.. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ కౌంటర్
Ktr
Ganesh Mudavath
|

Updated on: Sep 16, 2022 | 12:06 PM

Share

కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ (Telangana) గవర్నమెంట్ మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు అందించడం లేదని ఆరోపిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని, రాష్ట్ర వాటా నిధులను పంపిస్తూనే ఉన్నామని ఢిల్లీ (Delhi) పెద్దలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల నడుమ తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి సెంట్రల్ గవర్నమెంట్ పై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. రాబోయే రోజుల్లో కరెన్సీ నోట్లపై ప్రధాని మోడీ ఫొటోలు ముద్రించే అవకాశాలు లేకపోలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆ అవకాశం కల్పిస్తే.. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపై మోదీ బొమ్మను వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. భవిష్యత్ లో ఇలా జరిగినా ఆశ్చర్యపోవాల్సన పని లేదని స్పష్టం చేశారు.

మరోవైపు.. గుజ‌రాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మంత్రి కేటీఆర్ ఆందోళ‌న‌ వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును మార్చడం ప‌ట్ల ఆయ‌న అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును న‌రేంద్ర మోదీ మెడిక‌ల్ కాలేజీగా మార్చిన‌ట్లు ఆరోపించారు. స‌ర్దార్ ప‌టేల్ స్టేడియాన్ని న‌రేంద్ర మోడీ స్టేడియంగా మార్చిన‌ విషయాన్ని గుర్తు చేశారు. కాగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎల్‌జీ వైద్య కళాశాల పేరును ‘నరేంద్ర మోదీ మెడికల్ కాలేజ్’గా మార్చారు. ఈ మేరకు మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ ప్రధాని తీరుపై ఫైర్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్