Telangana: కేసులు తక్కువగా ఉన్నా జాగ్రత్తగా ఉండాల్సిందే.. నిబంధనలు పాటించాలన్న మంత్రి హరీశ్

కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళల్లో భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ(Telangana) మంత్రి హరీశ్​రావు(Harish Rao) సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు...

Telangana: కేసులు తక్కువగా ఉన్నా జాగ్రత్తగా ఉండాల్సిందే.. నిబంధనలు పాటించాలన్న మంత్రి హరీశ్
Minister Harish Rao
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 05, 2022 | 7:05 AM

కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళల్లో భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ(Telangana) మంత్రి హరీశ్​రావు(Harish Rao) సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్.. సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున ఎలాంటి అలసత్యం, అజాగ్రత్త వహించేందుకు అవకాశం ఉండవద్దని అధికారులకు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉన్నా అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా(Corona) ముప్పు మరోసారి రాకుండా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 లక్షల డోస్‌ల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని, ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి టీకాలు ఇవ్వాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

మహారాష్ట్ర(Maharashtra) లో కరోనా కేసుల పెరుగుదలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా రాకుండా కట్టడి చేసే చర్యలు ప్రారంభించింది. దీంతో గతంలో సడలించిన నియమాలను మళ్లీ విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌(Mask) ధరించే నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈ మేరకు అదనపు చీఫ్‌ సెక్రటరీ జిల్లా అధికారులకు లేఖ రాశారు. రైళ్లు, సినిమాలు, బస్సులు, ఆడిటోరియంలు, ఆఫీసులు, ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్లు వంటి ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతే కాకుండా టెస్టింగ్‌, ట్రాకింగ్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి