Hyderabad: సంతలో వస్తువులా పసివాడిని అమ్మేశారు.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Hyderabad: హైదరాబాద్ అమానవీయ ఘటన వెలుగు చూసింది. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారి కొడుకుని కిడ్నాప్ చేసి వేరే వారికి విక్రయించాడో ప్రబుద్ధుడు.

Hyderabad: సంతలో వస్తువులా పసివాడిని అమ్మేశారు.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Baby Kidnap
Follow us

|

Updated on: Jun 05, 2022 | 8:04 AM

Hyderabad: హైదరాబాద్ అమానవీయ ఘటన వెలుగు చూసింది. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారి కొడుకుని కిడ్నాప్ చేసి వేరే వారికి విక్రయించాడో ప్రబుద్ధుడు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మొదట ఒక బాబు పుట్టగా.. రూ. 15 వేలకు ఓ వ్యక్తికి విక్రయించారు. అనంతరం ఈ జంటకు మరో బాబు పుట్టాడు. ఇది గమనించిన మొదటి బాబుని కొనుగోలు చేసిన వ్యక్తి.. ఈ బాబును ఎలాగైనా ఎత్తుకెళ్లి అమ్మేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో బెగ్గర్ దంపతలకు మాయమాటలు చెప్పి ఫుల్లుగా మద్యం తాగించాడు. వారికి తెలియకుండానే ఆ వ్యక్తి రూ. 1.5 లక్షలకు రెండో బాబును అమ్మేశాడు. మద్యం మత్తు నుంచి తేరుకున్న ఆ బెగ్గర్ దంపతులు.. బాబు కనిపించకపోవడంతో చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా కీలక వివరాలు వెలుగు చూశాయి. కిడ్నాపర్ మహమ్మద్ షరీఫ్ అలియాస్ సలీంతో పాటు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రయించిన ఇద్దరు బాబులను రక్షించి.. శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం