Hyderabad: ట్రాఫిక్‌లో చిక్కుకున్న తెలంగాణ గవర్నర్.. ట్రాఫిక్ పోలీసుల సమన్వయ లోపమే.
తెలంగాణ గవర్నర్ తమిళసైకీ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తప్పలేవు. అదెంటీ గవర్నర్ స్థాయి వ్యక్తి వస్తే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ట్రాఫిక్‌లో ఎలా చిక్కుకుందనేగా మీ సందేహం. అయితే ట్రాఫిక్ పోలీసుల సమన్వయం లోపం కారణంగా గవర్నర్ ట్రాఫిక్‌లో చిక్కుకునే పరిస్థితి తలెత్తింది. సోమవారం సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్‌లోని

తెలంగాణ గవర్నర్ తమిళసైకీ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తప్పలేవు. అదెంటీ గవర్నర్ స్థాయి వ్యక్తి వస్తే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ట్రాఫిక్‌లో ఎలా చిక్కుకుందనేగా మీ సందేహం. అయితే ట్రాఫిక్ పోలీసుల సమన్వయం లోపం కారణంగా గవర్నర్ ట్రాఫిక్‌లో చిక్కుకునే పరిస్థితి తలెత్తింది. సోమవారం సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చారు.
అయితే అదే సమయంలో ఆమె కాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. సోమాజిగుడ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో కాన్వాయ్ నిలిచిపోయింది. హైవేపే వాహనాలు పెద్ద ఎత్తున ఉండడంతో కాన్వాయ్ యూటర్న్ తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది ట్రాఫిక్‌కు క్లియర్ చేశారు. హైవేపై వస్తున్న వాహనాలను కాసేప ఆపడంతో గవర్నర్ కాన్వాయ్ ముందుకు కదిలింది. ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి…