జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో.. నేడే ప్రారంభం!

హైదరాబాద్ నగరవాసులకు మరో శుభవార్త. మరికొన్ని గంటల్లోనే జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య మెట్రో ట్రైన్ అందుబాటులోకి రాబోతుంది. 11 కిలోమీటర్ల ఉన్న ఈ మార్గాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నారు. ఈ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో కలిపే ప్రధాన మెట్రో స్టేషన్ ఈ మార్గంలోనే ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. ఫేస్ 1లో మూడు కారిడార్లు పూర్తైనట్లే. పాతబస్తీ పరిధిలో 6 కిలో మీటర్లు […]

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో.. నేడే ప్రారంభం!

హైదరాబాద్ నగరవాసులకు మరో శుభవార్త. మరికొన్ని గంటల్లోనే జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య మెట్రో ట్రైన్ అందుబాటులోకి రాబోతుంది. 11 కిలోమీటర్ల ఉన్న ఈ మార్గాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నారు. ఈ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో కలిపే ప్రధాన మెట్రో స్టేషన్ ఈ మార్గంలోనే ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. ఫేస్ 1లో మూడు కారిడార్లు పూర్తైనట్లే. పాతబస్తీ పరిధిలో 6 కిలో మీటర్లు మినహా అన్ని మార్గాల్లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.

ఈ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే.. నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నింటికీ మెట్రో సేవలు అందినట్లవుతాయి. ప్రస్తుతం కారిడార్‌-1, కారిడార్‌-3 కలిపి మొత్తం 56 కిలో మీటర్ల మేర మెట్రో రైలు పరుగులు పెడుతోంది. ప్రధాన ప్రాంతాల్లో మెట్రో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండటంతో.. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నాగోల్- హైటెక్ సిటీ మధ్య 29 కిలో మీటర్లు, ఎల్బీ నగర్-మియాపూర్ మధ్య 29 కిలో మీటర్లు.. ఇప్పటికే మెట్రో ట్రైన్స్ నడుస్తుండగా.. మూడో కారిడార్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్.. ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రాబోతుంది. కారిడార్ 1, 2, 3 కలిపి మొత్తం 69 కిలో మీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్ మెట్రో సేవలు.. ఇప్పటి వరకు ఒక ఎత్తైతే.. ఇక నుంచి మరో ఎత్తు. ఎందుకంటే.. ఈ కారిడార్ నగరం నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. జిల్లాలతో పాటు.. వివిధ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు నగరానికి చేరుకుంటారు. బస్టాండ్‌లో దిగగానే వెంటనే మెట్రో ట్రైన్ ఎక్కి తమ గమ్య స్థానానికి చేరుకునేలా ఈ రూట్ అందుబాటులో ఉంటుంది.

Published On - 6:59 am, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu