నేడు మేడారంకు తమిళిసై, కేసీఆర్.. భారీగా బందోబస్తు

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారంను.. గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కుటుంబ సమేతంగా సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గవర్నర్, కేసీఆర్, తెలంగాణ మంత్రులు, పలువురు అధికారులు సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించనున్నారు. కాగా.. ఇప్పటికే గవర్నర్, సీఎం మేడారం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం. అలాగే ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. […]

నేడు మేడారంకు తమిళిసై, కేసీఆర్.. భారీగా బందోబస్తు
Follow us

| Edited By:

Updated on: Feb 07, 2020 | 7:38 AM

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారంను.. గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కుటుంబ సమేతంగా సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గవర్నర్, కేసీఆర్, తెలంగాణ మంత్రులు, పలువురు అధికారులు సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించనున్నారు. కాగా.. ఇప్పటికే గవర్నర్, సీఎం మేడారం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం. అలాగే ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా.. మేడారం జాతరలో భాగంగా.. గురువారం సమ్మక్క గద్దె చేరుకుంది. ఈ రోజు భక్తులు భారీ స్థాయిలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. బెల్లంను నిలువెత్తు బంగారంలా సమర్పిస్తారు. ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్రప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. జాతర సందర్భంగా మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కోట్లాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని తరిస్తున్నారు.