Hyderabad: విద్యార్థులపై కాలేజీ సిబ్బంది దాడి.. ఆ విషయం గురించి అడిగేందుకు వెళ్లగా..

Srinidhi College: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ వివాదాలకు కేరాఫ్‌ మారుతోంది. కాలేజీ యాజమాన్యం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ కాలేజ్‌కు సంబంధించి రోజుకో పంచాయతీ వెలుగులోకి వస్తోంది. తాజాగా.. డీటెండ్‌ విద్యార్థులపై కాలేజీ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం..

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 31, 2023 | 9:58 PM

Srinidhi College: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ వివాదాలకు కేరాఫ్‌ మారుతోంది. కాలేజీ యాజమాన్యం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ కాలేజ్‌కు సంబంధించి రోజుకో పంచాయతీ వెలుగులోకి వస్తోంది. తాజాగా.. డీటెండ్‌ విద్యార్థులపై కాలేజీ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం.. కొంతమంది విద్యార్థులను క్లాసులకు హాజరు కాలేదంటూ డిటెండ్‌ చేసింది శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యం. దాంతో.. ఆ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులలో కలిసి కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్లారు. అయితే.. కాలేజ్‌ గేటు దగ్గరకు చేరుకోగానే.. వారిపై దాడి చేశారు సెక్యూరిటీ సిబ్బంది. డిటెండ్‌ విద్యార్ధులపై ఇష్టారీతిన రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ సెక్యూరిటీ సిబ్బంది. మొత్తం 26 మందిని అకారణంగా డిటెండ్‌ చేశారని ఆరోపించారు శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌. రెగ్యూలర్‌గా కాలేజ్‌కు వెళ్లినవారిని డిటెండ్‌ చేసి.. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ పెట్టినవారిని మాత్రం ఎగ్జామ్స్‌కు అనుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే.. యూనివర్శిటీ అప్‌గ్రేడ్‌ విషయంలో శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వ్యవహారం రచ్చరచ్చ అవుతోంది. యూనివర్శిటీగా మారకముందే.. విద్యార్థులను జాయిన్‌ చేసుకోవడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. వర్సిటీ పర్మిషన్ రాకున్నా, క్లాసులు నిర్వహించి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి కాలేజీలో నిరసనలు చేశారు. తాజాగా.. కొంతమంది విద్యార్థులను డిడెంట్‌ చేయడం.. ప్రశ్నించేందుకు వెళ్లినవారిపై శ్రీనిధి కాలేజ్‌ సిబ్బంది దాడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, కాలేజీ సిబ్బంది విద్యార్థులపై దాడిచేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..