Congress: తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వ్యూహాత్మక ఎత్తుగడ.. హైదరాబాద్ వేదిగా CWC మీటింగ్..
CWC meeting in Hyderabad: ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మత ఎత్తుగడతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత మీటింగ్ నిర్వహించడం, అదీ కూడా హైదరాబాద్‌లో పెట్టడం ద్వారా భారీ యాక్షన్ ప్లాన్‌కే కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఒకరిద్దరు కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ 39 మంది అగ్రనేతలు ఈ మీటింగ్‌కి హాజరవుతారు.
CWC meeting in Hyderabad: ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మత ఎత్తుగడతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత మీటింగ్ నిర్వహించడం, అదీ కూడా హైదరాబాద్‌లో పెట్టడం ద్వారా భారీ యాక్షన్ ప్లాన్‌కే కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఒకరిద్దరు కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ 39 మంది అగ్రనేతలు ఈ మీటింగ్‌కి హాజరవుతారు. ప్రత్యేకించి ఒకచోట మీటింగ్‌కి రాహులో, ప్రియాంకానో, సోనియానో ఒక్కరు హాజరుకావడమే కష్టం. అలాంటింది.. ఒకే వేదికపై ఆ ముగ్గురు కలిసి ఓ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా తెలంగాణ ఎన్నికలకు భారీ బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 16,17 తేదీల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది.
39 మంది జాతీయ స్థాయి అగ్రనేతలు ఈ మీటింగ్‌కి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సీడబ్ల్యూసీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌దే తొలి మీటింగ్ కానుంది. తెలంగాణ ఎన్నికలే టార్గెట్‌గా కార్యక్రమాల రూపకల్పనలో మునిగిన కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహించాలని చూస్తోంది. సోనియా, రాహుల్, ప్రియాంకను సభకు ఆహ్వానించే యోచనలో టీపీసీసీ ఉంది. ముగ్గురినీ ఒకే వేదికపై ఉంచడం ద్వారా తెలంగాణ ఎన్నికలకు భారీ బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్.
ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా
మరోవైపు, సెప్టెంబర్2న వైఎస్‌ఆర్ వర్థంతి ఉండటంతో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. సెప్టెంబర్ 3న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. తద్వారా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేయనుంది. అభ్యర్థుల పూర్తి వివరాలను ఈ కమిటీ పరిశీలించనుంది. సెప్టెంబర్ 4న టీపీసీసీ స్ర్కీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. పీఈసీ సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడనుంది.
అంతర్గత పోరుకు చెక్ పెట్టేలా..
అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. పార్టీలో అంతర్గత పోరుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో రేవంత్, ఉత్తమ్ గొడవ గురించి కూడా అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తోంది. టికెట్ల విషయంపై మొదలైన గొడవ.. పరస్పర ఆరోపణల వరకు వెళ్లింది. కాంగ్రెస్ ఉదయ్‌పూర్ తీర్మానం ప్రకారం.. కుటుంబంలో ఒక్కరికే సీటు ఇవ్వనుంది. అయితే, కొంతమంది కుటుంబంలో రెండు సీట్లు ఆశిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల వేళ ఎలాంటి అంతర్గత పోరు లేకుండా వ్యూహాత్మకంగా అడుగులేసే ఆలోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. గొడవలకు చెక్ పెట్టిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..