AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Nation-One Election: వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో మోడీ సర్కార్.. సర్వత్రా ఉత్కంఠ.. అదే జరిగితే..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సెప్టెంబర్‌లో పార్లమెంట్ అమృత్‌కాల్ స్పెషల్‌ను ప్రకటించింది మోదీ సర్కార్. సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఓ స్పెషల్ బిల్లును ప్రవేశపెట్టనుందంటూ జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి.

One Nation-One Election: వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో మోడీ సర్కార్.. సర్వత్రా ఉత్కంఠ.. అదే జరిగితే..
Parliament
Aravind B
|

Updated on: Aug 31, 2023 | 9:51 PM

Share

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సెప్టెంబర్‌లో పార్లమెంట్ అమృత్‌కాల్ స్పెషల్‌ను ప్రకటించింది మోదీ సర్కార్. సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఓ స్పెషల్ బిల్లును ప్రవేశపెట్టనుందంటూ జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే సమాచారం మేరకు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఒక దేశం.. ఒక ఎన్నికల అనే బిల్లును ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్‌సభ ఎన్నికలు.. అలాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రతిపాదనను అధ్యయం చేసినటువంటి లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తులు చేస్తున్నట్లు జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం లోక్‌సభ. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మామూలుగా వాటి గడువు ముగిసిన తర్వాత మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈ వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానం కింద మాత్రం లోక్‌సభ ఎన్నికలతో సహా రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కింద కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ కాలపరిమితిని పెంచడం.. అలాగే మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాల పరిమితిని తగ్గించడం ఉంటుందని తెలుస్తోంది. అయితే రాబోయే ప్రత్యేక సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమచారం. అయితే ఈ బిల్లును ఆమోదించాలంటే మాత్రం 2/3 వంతు మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ జమిలీ ఎన్నికలు నిజంగా సాధ్యమవుతుందా లేదా అనే దానిపై కూడా చాలావరకు ప్రశ్నలు ఉన్నాయి. అయితే కేంద్రం ఒకవేళ ఈ బిల్లును ప్రవేశపెడితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి