Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

89ఏళ్ల వయసులో పంచాయతీ అధ్యక్షురాలిగా సత్తా చాటిన వృద్ధురాలు.. ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటంటే…

పోస్ట్‌ పెట్టి కొద్ద సమయంలోనే... దాదాపు 11,000 వీక్షణలు 434 లైక్‌లు, టన్నుల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి. వీరమ్మాళ్‌ అమ్మకు జీవితంలో ఇంకా ముందుకు సాగడానికి దేవుడు ఆమెకు ధైర్యం, శక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదు అంటున్నారు కొందరు. ఈ వయసులో సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ మేడమ్ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

89ఏళ్ల వయసులో పంచాయతీ అధ్యక్షురాలిగా సత్తా చాటిన వృద్ధురాలు.. ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటంటే...
Oldest Panchayat President
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 31, 2023 | 10:03 PM

వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ఎందుకంటే.. కొందరు వయసులో వృద్ధులైనప్పటికీ యువకుల కంటే చురుగ్గా ఉంటారు. యువత చేయలేని అసాధ్యమైన పనులు, ఆలోచనలు చేస్తారు. వయసు అడ్డంకులను అధిగమించి లక్ష్యాన్ని సాధించేవారు కూడా చాలా మందే ఉంటారు. అలాంటి వారిలో ఉదాహరణ ఒకటి.. KFC వ్యవస్థాపకుడు కల్నల్ హార్లాండ్ సాండర్స్‌ ఒకరు. అతను 62ఏళ్ల వయసులో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టపడే ఫాస్ట్‌ ఫుడ్‌ చికెన్‌ వ్యాపారాన్ని స్థాపించాడు. దీనిని ఇప్పుడు మిలియన్ల మంది ఇష్టపడుతున్నారు. ఇలాంటి ప్రేరణ కలిగించే మరో వృద్ధురాలి కథ ఒకటి తాజాగా అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళనాడుకు చెందిన 89ఏళ్ల వృద్ధురాలు వీరమ్మాళ్‌ అమ్మ తమిళనాడులోని అరిట్టపట్టి పంచాయతీ అధ్యక్షురాలిగా పని చేసి పలువురికి ఆదర్శంగా నిలిచింది.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి సుప్రియా సాహు అరిట్టపట్టి గ్రామానికి చెందిన పంచాయతీ ప్రెసిడెంట్‌ అయిన వీరమ్మాళ్‌ అమ్మ కథను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశారు. హాయిగా విశ్రాంతి తీసుకునే వయసులో పంచాయతీ ప్రెసిడెంట్ విధులు నిర్వహిస్తూ..అధికారుల చేత శభాష్ అనిపించుకుంటున్నారని చెప్పారు. 89 ఏళ్ల వీరమ్మాళ్ అమ్మ స్ఫూర్తిదాయక మహిళ. ఆమె ధైర్యం, దృఢ సంకల్పం ప్రజలనే కాకుండా అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది. అత్యంత వృద్ధ మహిళా పంచాయతీ అధ్యక్షురాలిగా వీరమ్మాళ్‌ అమ్మ తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఆమె పెదవులపై చెరగని చిరునవ్వు, అపరిమితమైన ఉత్సాహం అందరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. ఏమీ చేయలేక వణికిపోతూ మూలన కూర్చునే వయసులో.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంట్ గా గెలిచినా అందరూ మెచ్చుకునేలా తన బాధ్యతలు నిర్వర్తించినందుకు గర్వపడుతున్నానంటూ IAS అధికారిణి సుప్రియా సాహు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

89ఏళ్ల వయసులో వీరమ్మాళ్ అమ్మ అంత చురుగ్గా ఉండటానికి కారణం… తాను రోజంతా పొలంలో పనిచేస్తుంది. మినుములు, తృణధాన్యాలు వంటి సంప్రదాయ భోజనం చేయడం తన ఫిట్‌నెస్ రహస్యమని వీరమ్మాళ్ చెప్పారు. వీరమ్మాళ్ నాయకత్వంలో అరిటపట్టి మధురై కూడా జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆమె సింపుల్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ అంటూ IAS అధికారిణి సుప్రియా సాహు వెల్లడించారు. ఐఏఎస్‌ అధికారి చేసిన ఈ ట్విట్‌పై నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు.

పోస్ట్‌ పెట్టి కొద్ద సమయంలోనే… దాదాపు 11,000 వీక్షణలు 434 లైక్‌లు, టన్నుల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి. వీరమ్మాళ్‌ అమ్మకు జీవితంలో ఇంకా ముందుకు సాగడానికి దేవుడు ఆమెకు ధైర్యం, శక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదు అంటున్నారు కొందరు. ఈ వయసులో సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ మేడమ్ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…