Smuggling Gold: బంగారం స్మగ్లింగ్.. ఇదో కొత్త రకం ఎత్తుగడ.. తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యూటెల్లాలో పౌడర్ రూపంలో ఉన్న ఈ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ల కింద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడి కొనాలంటేనే సామాన్య ప్రజలు పారిపోయేంతలా మండితున్నాయి. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ చేసే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోకుండా బంగారాన్ని అక్రమంగా దాటించేస్తున్నారు. కొందరు లోదస్తుల్లో బంగారం దాచిపెడుతుంటే.. మరికొందరు క్యాపుల్స్ రూపంలో, కొందరు బంగారం పేస్ట్ రూపంలో అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా అలాంటి కొత్త స్మగ్లింగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. న్యూటెల్లా బాటిల్‌ల్లో బంగారం తీసుకెళ్తున్న వ్యక్తిని పట్టుకున్నారు తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది. రూ. 8.9 లక్షల విలువైన 149 గ్రాముల బరువున్న 24క్యారెట్ స్వచ్ఛత కలిగిన బంగారు కడ్డీ రెండు నుటెల్లా జార్లలో పౌడర్ రూపంలో లభించినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడు సోమవారం కౌలాలంపూర్ నుండి తిరుచ్చికి వచ్చినట్టుగా తెలిసింది.
బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. న్యూటెల్లా క్రీమ్ బాటిల్‌లో స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. 24 క్యారెట్ల హాల్‌మార్క్ కలిగిన రూ.8.9 లక్షల విలువైన 149 గ్రాముల బంగారు కడ్డీని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని న్యూటెల్లా జార్‌లో గుట్టుగా దాచి తరలిస్తున్న ప్రయాణికుడిని అరెస్టు చేశారు. న్యూటెల్ల రెండు డబ్బాల్లో ఈ బంగారం పొడి రూపంలో లభించినట్టుగా చెప్పారు.
Tamil Nadu | Based on intelligence, the AIU, Trichy Airport seized one piece of gold bar of 24K purity weighing 149.000 grams, valued at Rs. 8.90 Lakhs. The Gold bar was extracted from gold powder concealed in two Nutella jars by a passenger who arrived from Kuala Lumpur on… pic.twitter.com/AWAtBc7j5N
— ANI (@ANI) August 30, 2023
మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యూటెల్లాలో పౌడర్ రూపంలో ఉన్న ఈ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ల కింద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.
విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ ఇదే తొలిసారి కాదు. ఇలాంటివి పదుల సంఖ్యలో ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం బ్యాంక్ నుంచి బెంగళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్టుకు ఎయిర్ ఏషియా విమానంలో దిగిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 8.2 లక్షల విలువైన 48 వేల సిగరెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.
ఇది కాకుండా గత ఏప్రిల్‌లో కౌలాలంపూర్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ మహిళను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. ఆమె బ్యాగ్‌లో 22 సజీవ పాములు ఉన్నాయని, వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..