AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: ఇండిగో విమానంలో ఇస్రో చీఫ్‌.. గుర్తుపట్టిన ఎయిర్‌ హోస్టెస్‌ ఏం చేసిందో తెలుసా..?

చంద్రయాన్-3 సక్సెస్ తో యావత్ ప్రపంచం ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తోంది. ఈ క్రమంలోనే MR S సోమనాథ్ – ఇస్రో చైర్మన్” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.  INDIGO విమానంలో ప్రయాణిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కి ఊహించని స్వాగతం లభించింది. విమానంలో సోమనాథ్ ని చూసిన ఎయిర్ హోస్టెస్ వారికి స్వాగతం పలికాలరు.  ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు గర్విస్తున్నామంటూ

Chandrayaan-3: ఇండిగో విమానంలో ఇస్రో చీఫ్‌.. గుర్తుపట్టిన ఎయిర్‌ హోస్టెస్‌ ఏం చేసిందో తెలుసా..?
Air Hostess Welcomes Isro C
Jyothi Gadda
|

Updated on: Aug 31, 2023 | 4:56 PM

Share

చంద్రుడిపై చేరిన భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్- 3 ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. దీంతో మన దేశం అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధనలో తనదైన చరిత్రను లిఖించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ నిలిచింది. శాస్త్రవేత్తలు, పరిశోధకుల అవిరామ కృషికి ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్‌ భారతావనితో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. వారి విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారు. ఈ విజయం తర్వాత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు ఇండిగో క్యాబిన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. హత్తుకునే క్షణాన్ని ఎయిర్ హోస్టెస్ పూజా షా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇది ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ వీడియో లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pooja Shah (@freebird_pooja)

చంద్రయాన్-3 సక్సెస్ తో యావత్ ప్రపంచం ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తోంది. ఈ క్రమంలోనే MR S సోమనాథ్ – ఇస్రో చైర్మన్” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.  INDIGO విమానంలో ప్రయాణిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కి ఊహించని స్వాగతం లభించింది. విమానంలో సోమనాథ్ ని చూసిన ఎయిర్ హోస్టెస్ వారికి స్వాగతం పలికాలరు.  ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు గర్విస్తున్నామంటూ విమాన సిబ్బంది ప్రకటించారు.. అంతే కాదు.. తమ విమానాల్లో హీరోలు ప్రయాణించటం మాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు.

వీడియోలో క్యాబిన్ సిబ్బంది హర్షధ్వనాలు చేశారు. ‘మా విమానంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రయాణిస్తున్నారని చెప్పడానికి మేము గర్వపడుతున్నామంటూ సంతోషం వ్యక్తం చేశారు.. శ్రీ సోమనాథ్, అతని బృందానికి చప్పట్లతో స్వాగతం పలికారు. మీరు మా విమానంలో ఎక్కినందుకు మేము గర్విస్తున్నాము సార్ అంటూ ప్రతి ఒక్కరూ అంటున్నారు. భారతదేశం గర్వపడేలా చేసినందుకు, మీ బృందానికి అభినందనలు అంటూ విమానంలోనే సందడి చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..