Watch Viral Video: అందరి కడుపునింపే స్విగ్గీ ఫుడ్ డెలివరీ మ్యాన్.. ఆకలితో ఏం చేస్తున్నాడో చూస్తే..
వారం రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక మనిషిగా మనం ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. కష్టపడి పనిచేసే కార్మికులందరికీ ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. మీరు వేరొకరి జీవితంలో ఆనందాన్ని సృష్టిస్తే, అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుందని మరొకరు ట్విట్ చేశారు. అంతేకాదు..
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని మనల్ని నవ్వించే వీడియోలు కాగా, కొన్ని ఏడిపించేవిగా ఉంటాయి. కొన్నిసార్లు భయపెట్టే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా విడుదలైన వీడియో కూడా ఎమోషనల్‌గా ఉంది. ఈ వీడియో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి ఉద్యోగికి సంబంధిచినది. స్విగ్గీ డెలివరీ మ్యాన్ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో అతను ఒక దుకాణం వెలుపల టీ, బిస్కెట్లు తింటూ కనిపిస్తాడు. గత వారం పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అసలు విషయం ఏంటంటే..
ఇంటింటికి వెళ్లి ఫుడ్ డెలివెరీ చేసే స్విగ్గీ డెలివరీ బాయ్ ఉద్యోగుల గురించి మనందరికీ తెలిసిందే. అయితే, వారి ఉద్యోగం వెనుక వారు పడే కష్టం మనలో చాలా మందికి తెలియదు. ఎండలో వానలో, రాత్రి పగలు తేడా లేకుండా స్విగ్గీ డెలివరీ బాయ్స్ కష్టపడుతూ ప్రజలకు పార్శిల్ అందజేస్తుంటారు. గతంలో సోషల్ మీడియాలో కూడా స్విగ్గీ డెలివరీ బాయ్స్ కష్టాలకు సంబంధించిన అనేక వీడియోలను మనం చూశాం. అయితే, అలాంటిదే ఈ వీడియో కూడా. వైరల్ అవుతున్న ఈ వీడియోలో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒక షాప్ బయట కూర్చుని కొన్ని బిస్కెట్లతో టీ తాగుతూ కనిపించాడు. ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేసే ఈ డెలివరీ మెన్ గంటల తరబడి ఎలా ఆకలితో ఉంటారనే దాని గురించి ఆలోచించేలా ఈ వీడియో ప్రజల హృదయాలను కదిలించింది.
View this post on Instagram
వారం రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపట్ల దయచేసి మంచిగా వ్యవహరించండి అంటూ సూచిస్తున్నారు. డెలివరీ బాయ్‌ల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఒక మనిషిగా మనం ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. కష్టపడి పనిచేసే కార్మికులందరికీ ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. మీరు వేరొకరి జీవితంలో ఆనందాన్ని సృష్టిస్తే, అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుందని మరొకరు ట్విట్ చేశారు. అంతేకాదు.. మన జేబులోంచి టిప్పుగా ఇచ్చే 30-50 రూపాయలు వారికి చాలా ఎక్కువ. మీరిచ్చే కొంచం సహాయంతో వారి జీవితాలు మరింత మెరుగుపడతాయని కోరుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..