Watch Video: ఆ ఊరిలో పట్టపగలు నడిరోడ్డుపై జనాల మధ్య తిరుగుతోన్న మృగరాజు.. పట్టించుకోని జనాలు

అడవిలో ఉండే కౄరమృగాలు సైతం మృగరాజును చూసి అల్లంత దూరం పరుగు లంకించుకుంటాయి. అలాంటిది నగరంలోని పట్టపగలు వాహనాలు అటూఇటూ తిరుగుతూ రద్దీగా ఉండే బిజీ రోడ్లపై సింహం నడుస్తుంటే అసలెవ్వరూ భయపడటం లేదు. పైగా అదేదో గ్రామ సింహంలా...

Watch Video: ఆ ఊరిలో పట్టపగలు నడిరోడ్డుపై జనాల మధ్య తిరుగుతోన్న మృగరాజు.. పట్టించుకోని జనాలు
Wild Life Animal Roaming Around Karachi City’s Busiest Roads
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 31, 2023 | 1:31 PM

కరాచీ, ఆగస్టు 31: అడవిలో ఉండే కౄరమృగాలు సైతం మృగరాజును చూసి అల్లంత దూరం పరుగు లంకించుకుంటాయి. అలాంటిది నగరంలోని పట్టపగలు వాహనాలు అటూఇటూ తిరుగుతూ రద్దీగా ఉండే బిజీ రోడ్లపై సింహం నడుస్తుంటే అసలెవ్వరూ భయపడటం లేదు. పైగా అదేదో గ్రామ సింహంలా క్యాజువల్‌గా చూస్తున్నారు. ఈ విచిత్ర ఘటన పాకిస్థాన్‌లోని కరాచిలో మంగళవారం (ఆగస్టు 29) సాయంత్రం చోటుచేసుకుంది.

పాకిస్థాన్‌లో కరాచీలో రద్దీగా ఉన్న షరియా ఫైసల్‌ నగర రోడ్లపై మంగళవారం సాయంత్రం ఊహించని విధంగా సింహం ప్రత్యక్షమైంది. రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై సింహం దర్జాగా నడుచుకుంటూ షికారుకెళ్లింది. కొంతమంది బాటసారులు సింహాన్ని గమనించకుండా దానికి దారిచ్చి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నారు. కాసేపటికీ కొందరు గమనించి సింహాన్ని చూసేందుకు గుంపులుగా గుమిగూడారు.

ఇవి కూడా చదవండి

నగరంలోని ఆయేషా బవానీ కాలేజీ సమీపంలోని ఓ బిల్డింగ్ పార్కింగ్ వద్దకు చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సింహాన్ని బంధించేందుకు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలో తరలిస్తుండగా సింహం పొరపాటున రోడ్లపైకి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. గంటపాటు శ్రమించి సింహాన్ని రక్షించారు. దాని తరలిస్తోన్న వాహనం డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వన్యప్రాణుల చట్టాల ప్రకారం నివాస ప్రాంతాల్లో సింహాలను వదిలడం చట్టరిత్యా నేరం అని కన్జర్వేటర్ సింధ్ వన్యప్రాణి విభాగం జావేద్ మెహర్ తెలిపారు. దేశంలో బ్లాక్ మార్కెట్ ఉందని, అడవి జంతువుల స్మగ్లింగ్ జరుగుతున్నట్లు జావేద్ మెహర్ పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే