Gorilla: నీ ప్రేమ తగలెయ్య..! అని పక్కకు వెళ్తున్నా..! పులి పిల్లల్ని ముద్దాడిన గొరిల్లా.
ప్రేమకు జాతి, కులం, మతం ఉండవంటారు. ఇది మనుషుల్లోనే కాదు.. అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ బయటపడుతుంటుంది. కోతులు, కుక్కలు.. పిల్లులు, ఎలుకలు.. ఇలా బద్ధశత్రువులైన జంతువులను కూడా కొన్నిసార్లు ప్రేమ దగ్గర చేస్తూ ఉంటుంది. అంతా ఆశ్చర్యపోయేలా వాటి స్నేహం ఉంటుంది. వీటిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి.. అనే సందేశాన్ని అప్పుడప్పుడూ ఇస్తుంటాయి.
ప్రేమకు జాతి, కులం, మతం ఉండవంటారు. ఇది మనుషుల్లోనే కాదు.. అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ బయటపడుతుంటుంది. కోతులు, కుక్కలు.. పిల్లులు, ఎలుకలు.. ఇలా బద్ధశత్రువులైన జంతువులను కూడా కొన్నిసార్లు ప్రేమ దగ్గర చేస్తూ ఉంటుంది. అంతా ఆశ్చర్యపోయేలా వాటి స్నేహం ఉంటుంది. వీటిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి.. అనే సందేశాన్ని అప్పుడప్పుడూ ఇస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో రోజూ కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పులి పిల్లలపై ఓ గొరిల్లా మనసు పారేసుకుంది. వాటిని ప్రేమతో దగ్గర తీసుకోవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. జంతు సంరక్షణ శాలలో ఓ గొరిల్లా రెండు పులి పిల్లలతో ఆడుకోవడం చూస్తాం. అంతలో వాటిపై గొరిల్లాకి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తుంది. పులి పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టాలని చూస్తుంది. నీ ప్రేమ తగలెయ్య.. నేను పోతా.. అంటూ అది వెనక్కు వెళ్తున్నా విడవకుండా వెంటపడుతుంది. అంతలో మరో పులి పిల్ల.. ఆడుకుందాం రా.. అన్నట్లుగా దాని వద్దకు వెళ్తుంది. పోనీలే నువ్వయినా వచ్చావ్.. అనుకుంటూ సీసాలో పాలు పడుతుంది. దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపిస్తుంది. ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయిన గొరిల్లా, పులి పిల్లలు.. ఎంతో ప్రేమతో ఆడుకోవడం.. నెటిజన్లను కట్టిపడేస్తోంది. మనుషుల్లో లేని స్వచ్ఛమైన ప్రేమను జంతువుల్లో చూస్తున్నాం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

