Watch Video: వారెవ్వా.. ఇది ఆటోనా గార్డెనా.. కదిలే తోట అంటున్న ప్రయాణికులు..! డ్రైవర్ ఐడియాకు నెటిజన్లు ఫిదా..!
అంతే కాదు విరాళం ఇచ్చే వారి కోసం రెండు ప్రత్యేక బాక్సులు కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. ప్రయాణికులు తమకు తోచినంత అందులో సహయంగా ఇవ్వొచ్చు. గతంలో ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ కూడా తన ఆటోను ఇదే తరహాలో పర్యావరణహితంగా డిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆటోలో మొక్కలు పెంచాడు. ఈ మొక్కలు తనకు, ప్రయాణీకులకు ప్రత్యక్ష సూర్యకాంతి నుండి రక్షణ కల్పిస్తాయని మహేంద్ర కుమార్ తెలిపారు.
చాలా మందికి గార్డెన్ అంటే ప్రత్యేక ప్రేమ. గ్రామాల్లో అయితే ఇష్టమైన కూరగాయలు, పూల, పండ్ల మొక్కలను ఇంటి చుట్టుతా పెంచుకోవచ్చు. అదే నగరాల్లో ఇది కాస్త కష్టమే అయినప్పటికీ ఇప్పుడు చాలా మంది టెర్రస్ గార్డెన్ తయారు చేస్తున్నారు. సొంత ఇల్లు ఉన్నవారు చిన్నాచితకా స్థలంలో పూల మొక్కలు సాగు చేసుకుంటున్నారు. చాలా మంది అద్దె ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నవారికి స్థలం దొరకడం కష్టం కాబట్టి… ఉన్న కొద్దిపాటి స్థలంలో కుండీల్లో మొక్కలు పెంచి సంతోషించే వారూ చాలా ఎక్కువ మందే ఉన్నారు. పచ్చని మొక్కలు, పూలు మనసుకు కొంత ఆనందాన్ని ఇస్తాయి. ఒత్తిడికి గురైన మనసును ప్రశాంతంగా ఉంచే శక్తి ఈ మొక్కలకు ఉంది. అయితే, ఇళ్ల ముందు, పార్కుల్లో, ఆఫీసుల ముందు మొక్కలను చూస్తుంటాం. అయితే ఎవరైనా ఆటోల్లో మొక్కలు పెంచటం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. కదిలే తోటలాంటి ఈ ఆటో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది చెన్నైకి చెందినదిగా తెలిసింది.
మన దేశంలో ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఆటోలు ప్రయాణికులు కూర్చునేందుకు స్థలంతో పాటు ఆటో వెనుక లగేజీ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు తమ ఇష్టానుసారంగా ఆటోను అటు ఇటుగా సవరించుకుంటుంటారు. ప్రయాణికులు వర్షంలో చిక్కుకోకుండా కవర్ డోర్ సహా ఆటో ముందు కొన్ని ఫ్లవర్ డెకరేషన్, స్టిక్కర్లు, అభిమాన సినీ నటుల ఫోటోలు, వారి డైలాగులు, ప్రకటనలు ఇలా ఎన్నో వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి. కానీ చెన్నై కుబేంద్రన్ ఆటో మాత్రం ఈ ఆటోలన్నింటికీ పూర్తి భిన్నం.
View this post on Instagram
@depthoughtsz పేరుతో చెన్నై ఆటో డ్రైవర్ కుబెందిరన్ Instagramలో షేర్ చేసిన ఆటో వీడియో వెరీ స్పెషల్. ఈ ఆటోలో అన్నీ మొక్కలే కనిపిస్తాయి. ట్రై సైకిల్‌లో కుండీలు పెట్టి అందులో మొక్కలు పెంచుతున్నారు. అంతే కాకుండా స్లిమ్ మోటివేషనల్ బుక్స్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అవయవ దానం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా మంచిమాటలు కూడా ఈ ఆటోలలో పోస్టర్‌లు కనిపిస్తాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను మిలియన్ల మందికి వీక్షించారు. 1. 8 లక్షలకు పైగా లైక్‌లు చేశారు. సోషల్ మీడియా యూజర్లు ఇది అద్భుతం అంటున్నారు.. ఇది ఒక ట్రావెలింగ్ పార్క్! అంటూ ప్రశంసిస్తున్నారు.. అది రిక్షా కాదు మినీ గార్డెన్ అని మరోకరు కొనియాడుతున్నారు.. మరొకరు దానిని ఆకుపచ్చ ఆటో అంటూ పిలిచారు. ఆటో డ్రైవర్ ఆలోచనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు నలువైపుల నుంచి ఆక్సిజన్ అందుతుందని కొందరు, పర్యావరణహితంగా ఉండే ఆటో డ్రైవర్‌కు సహకరించాలని మరికొందరు అన్నారు.
ఆటో పైభాగం కూడా పచ్చదనం, పూలతో డిజైన్ చేయబడింది. సీటు వెనుక కూడా మీరు మొక్కలు చూడవచ్చు. అంతే కాదు విరాళం ఇచ్చే వారి కోసం రెండు ప్రత్యేక బాక్సులు కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. ప్రయాణికులు తమకు తోచినంత అందులో సహయంగా ఇవ్వొచ్చు. గతంలో ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ కూడా తన ఆటోను ఇదే తరహాలో పర్యావరణహితంగా డిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆటోలో మొక్కలు పెంచాడు. ఈ మొక్కలు తనకు, ప్రయాణీకులకు ప్రత్యక్ష సూర్యకాంతి నుండి రక్షణ కల్పిస్తాయని మహేంద్ర కుమార్ తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..