AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొత్త తరహా ఐడియా.. రన్నింగ్ మెట్రో ట్రైన్‌లో ఫ్యాషన్ షో.. బిత్తరపోయిన ప్రయాణికులు..

మెట్రోకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మెట్రోలో వివాదాలు, ఘర్షణలు, మహిళల సిగపట్లు వంటి వింత వింత దృశ్యాలను చూశాం. నిబంధనలను పాటించాలని మెట్రో ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. అయినప్పటికీ ప్రజలు వారి వింత విచిత్ర చేష్టలను మానుకోవడం లేదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

Viral Video: కొత్త తరహా ఐడియా.. రన్నింగ్ మెట్రో ట్రైన్‌లో ఫ్యాషన్ షో.. బిత్తరపోయిన ప్రయాణికులు..
Fashion Show
Jyothi Gadda
|

Updated on: Aug 31, 2023 | 7:19 PM

Share

మెట్రో వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలా వరకు ప్రయాణికుల మధ్య తగాదాలు, గొడవలు లేదా అశ్లీల చర్యలు ఉంటాయి. అయితే తాజాగా నాగ్‌పూర్ మెట్రోలో ఎవరూ ఊహించని దృశ్యం కనిపించింది. ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో మెట్రోలో డిబేట్, ఫైట్, అశ్లీల వీడియోలను చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మెట్రోలో ఫ్యాషన్ షో చూశారా? కాకపోతే, ఇప్పుడు చూడండి. ఇది మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రోలో కనిపించింది. ఇక్కడ కదులుతున్న రైలులో ఫ్యాషన్ షో జరగడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఫ్యాషన్‌ షో ఆదివారం అంటే ఆగస్టు 28న జరిగింది. వారాంతం కావడంతో మెట్రోలో జనాల రద్దీ చాలా తక్కువగానే ఉంది. ఈ దృశ్యాన్ని చూసి మొదట అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, ఆ తర్వాత అందరూ మోడల్స్ కోసం చప్పట్లు కొట్టారు.

ఈ ఫ్యాషన్ షోలో 2 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారు పాల్గొనడం విశేషం. మోడల్స్ వేసుకునే డ్రెస్సులను ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్స్ విద్యార్థులు డిజైన్ చేశారు. నాగ్‌పూర్ మెట్రో సెలబ్రేషన్ ఆన్ వీల్స్ పేరుతో ఒక పథకాన్ని నడుపుతుంది. దీని కింద వివిధ సంస్థలు, సమూహాలు, వ్యక్తులు డబ్బు కలెక్ట్‌ చేస్తున్నారు. అలా వచ్చిన నగదుతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ వైరల్ వీడియోను (@indiatvyogendra) అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మొత్తానికి నాగ్‌పూర్‌లో కదిలే మెట్రోలో ఫ్యాషన్ షో అందరినీ అదరగొట్టేసింది. మెట్రో కోచ్‌లో చేసిన క్యాట్‌వాక్ కోసం ర్యాంప్, క్యాప్‌వాక్ చేస్తున్న యువత నుండి వృద్ధులను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆగస్టు 28న షేర్ చేసిన క్లిప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది మిలియన్ల వ్యూస్‌ను పొందింది. వేలాది మంది దీన్ని లైక్ చేసారు.

ఇవి కూడా చదవండి

మెట్రోకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మెట్రోలో వివాదాలు, ఘర్షణలు, మహిళల సిగపట్లు వంటి వింత వింత దృశ్యాలను చూశాం. నిబంధనలను పాటించాలని మెట్రో ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. అయినప్పటికీ ప్రజలు వారి వింత విచిత్ర చేష్టలను మానుకోవడం లేదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..