AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ.. రూట్, తేదీ వివరాలు

Special Trains: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య మరో నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ ప్రకటనలో తెలిపింది.

Special Trains: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ.. రూట్, తేదీ వివరాలు
Tirupati Railway Station
Janardhan Veluru
|

Updated on: Aug 12, 2022 | 4:30 PM

Share

Railway Passenger Alert: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో తీపి కబురు అందించింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి (Secunderabad – Tirupati) మధ్య మరో నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ ప్రకటనలో తెలిపింది.  ఆగస్టు 15న సాయంత్రం 06.20 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07411) సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. అలాగే ఆగస్టు 16న సాయంత్రం 05.15 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07412) తిరుపతి నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.25 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, కృష్ణ, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆధోని, గుంతకల్, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

అలాగే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య విజయవాడ మీదుగా రెండు సర్వీసుల ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఆగస్టు 17వ తేదీన సాయంత్రం 06.40 గం.లకు ప్రత్యేక రైలు (07473) సికింద్రాబాద్ నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.45 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది. ఎదురు దిశలో ఆగస్టు 18వ తేదీన సాయంత్రం 05.00 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07474) తిరుపతి నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 05.45 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. రెండు మార్గాల్లోనూ ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగతాయి.

ఇవి కూడా చదవండి
Special Trains between Secunderabad - Tirupati

Special Trains between Secunderabad – Tirupati

ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ కోచ్‌లు ఉంటాయని ద.మ.రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు..

అలాగే నర్సాపూర్ – సికింద్రాబాద్ మధ్య మూడు సర్వీసుల ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. ఆగస్టు 13, 15 తేదీల్లో ప్రత్యేక రైలు నెం.07466 సాయంత్రం 06.00 గం.లకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04.10 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆగస్టు 14న ప్రత్యేక రైలు నెం.07467 రాత్రి 09.05 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లో ఉంటాయని రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!