Rakhi Festival 2022: రాఖీ కట్టిన మహిళ.. కాళ్లు మొక్కి ఉద్వేగానికి లోనైన హెడ్ కానిస్టేబుల్..
Rakhi Festival 2022: నిరంతరం ప్రజల రక్షణలో బిజీగా ఉండే పోలీసులకు రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు మహిళామణులు.
Rakhi Festival 2022: దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ పండుగను జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెల్లు తమ అన్నదమ్ములకు రక్షాబంధన్ కట్టి తమ ప్రేమను పంచుకుంటున్నారు. కాగా, నిరంతరం ప్రజల రక్షణలో బిజీగా ఉండే పోలీసులకు రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు మహిళామణులు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతిగా రక్షాబంధన్ పండుగ అని, మహిళల సంరక్షణ కోసమా పోలీసులు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రక్షణగా నిలుస్తున్నామని మేడ్చల్ సిఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. నిత్యం విధులల్లో ఉంటూ కుటుంబాలకు దూరంగా ఉంటున్న పోలీసు సోదరులకు రాఖీలు కట్టడం సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు. అయితే మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో మహిళలు పోలీసులకు రాఖీ కడుతున్న సమయంలో భావోద్వేగానికి గురైన హెడ్ కానిస్టేబుల్ MD పాషా.. మహిళల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పాషా చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..