Munugodu Bypoll: బీజేపీ ఓటమి ఖాయం.. మునుగోడు ఉప ఎన్నికపై సిపిఐ నేత పల్లా కీలక వ్యాఖ్యలు..!
Munugodu Bypoll: ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ మొత్తం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
Munugodu Bypoll: ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ మొత్తం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో ప్రధాన పార్టీలన్నీ బైపోల్ వ్యూహాలకు పదును పెట్టే పనిలోపడ్డాయి. అయితే ఈ మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు అక్కడ 12సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ఆరుసార్లు కాంగ్రెస్, ఐదు సార్లు సిపిఐ, ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి.
అయితే, ఈసారి ఉప ఎన్నికల్లో పోటీ విషయమై సిపిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి చెబుతున్నారు. సిపిఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలు చాలా బలంగా ఉన్నాయని, మునుగోడు నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అన్నారు. ఇదే అంశంపై పల్లా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘మునుగోడు ఉప ఎన్నికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నల్లగొండ జిల్లా, మండల, గ్రామ కమిటీల అభిప్రాయాలను సేకరిస్తున్నాం. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలు బలంగా ఉన్నాయి. స్థానిక, రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. పోటీ చేయాలా? వద్దా?, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి? అనేది ఇంకా నిర్ణయించలేదు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై సిపిఎంతో కూడా చర్చిస్తాం. మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం. మునుగోడు నుంచే బీజేపీ పతనం ప్రారంభం. వామపక్షాలను రెచ్చగొడితే బీజేపీ పతనం తప్పదు. మా మద్దతు టీఆర్‌ఎస్ పార్టీకా, కాంగ్రెస్ పార్టీకా అనేది ఇప్పుడే చెప్పలేము. మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర మహాసభల తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. మేము పోటీలో లేకుంటేనే మద్దతుపై ఆలోచిస్తాం.’ అని తెలిపారు పల్లా వెంకట్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..