SCR: మరో రికార్డు కైవసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. ఆ విషయంలో అన్ని జోన్ల కంటే ముందంజ
దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 103 రోజుల్లో వేగవంతంగా రూ.100 కోట్ల తుక్కు అమ్మకం ఆదాయం నమోదు చేసిన ఘనత సొంతం చేసుకుంది. భారతీయ రైల్వేలో ‘మిషన్ జీరో స్క్రాప్’ (Zero Scrap) లక్ష్య...
దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 103 రోజుల్లో వేగవంతంగా రూ.100 కోట్ల తుక్కు అమ్మకం ఆదాయం నమోదు చేసిన ఘనత సొంతం చేసుకుంది. భారతీయ రైల్వేలో ‘మిషన్ జీరో స్క్రాప్’ (Zero Scrap) లక్ష్య సాధనకు కృషి చేస్తున్న అన్ని రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత 2022 -23 ఆర్థిక సంవత్సరంలో 103 రోజుల్లోనే తుక్కు అమ్మకం ద్వారా రూ.100 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది రూ.52.12 కోట్లు సాధించగా.. ప్రస్తుతం ఆ సంఖ్యకు రెట్టింపు నమోదు చేయడం విశేషం. భారతీయ రైల్వే ఈ-ప్రోక్యూర్‌మెంట్ విధానంలో పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ-వేలంలో తుక్కు వస్తువులను సమీకరించడం, విక్రయాలను చేపట్టడం ద్వారా వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడంలో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో నిలిచింది. అన్ని డివిజన్ల ద్వారా ఫుట్ బై ఫుట్ మ్యాపింగ్ నిర్వహించడంతో వినియోగంలో లేని తక్కును వెంటనే గుర్తించి విక్రయిస్తున్నారు. తుక్కును ఒక నెలకు మించి లేదా ట్రక్కు లోడ్ పరిమాణం వరకు పేరుకుపోకుండా సజావుగా ఎప్పటికప్పుడు అమ్మకం చేపట్టడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఈ ఘనత అందుకుంది.
విరిగిన పట్టాలు, రైల్వే లోకోలు, కోచులు, వ్యాగన్లు, ఇనుప లోహాలు, ఇతర లోహాల వస్తువులను డివిజన్లు, వర్క్‌షాపుల నుంచి సేకరించి విక్రయిస్తుంది. ఈ ప్రక్రియతో వర్క్‌షాపులు, లోకో షెడ్‌లు, రైల్వే యూనిట్లు, రైల్వే ప్రాంగణాలు పరిశుభ్రంగా మారాయి. అంతే కాకుండా తుక్కు ఆర్థిక వనరుగా మారి ఖజానా ఆదాయానికి దోహదపడుతోంది. కొన్ని విభాగాలు ఇప్పటికే ‘‘మిషన్ జీర్ స్క్రాప్’’ లక్ష్యాన్ని సాధించాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని స్టోర్స్ డిపోలలో యూజర్ డిపో మాడ్యూల్ (యూడిఎమ్) విధానాన్ని పూర్తి స్తాయిలో అమలు పరుస్తుంది. వినియోగదారులు అందరూ యూడిఎమ్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించారు. ఈ విధానాలన్నింటినీ ఈ-ప్రొక్యూర్‌మెంట్, ఈ-వేలం అమ్మకం ద్వారా నిర్వహిస్తున్న జోన్ నిరాటంకంగా గత 11 సంవత్సరాలు మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో రైల్వే బోర్డు ఎఫీషియెన్సీ షీల్డును అందుకుంటోంది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఎప్పటికప్పుడు వేగవంతంగా తుక్కు అమ్మకం నిర్వహిస్తూ రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంలో కృషి చేసిన మెటీరియల్ మేనేజ్‌మెంట్ విభాగం అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ`వేలం అమ్మకం విధానంతో పారదర్శకత ఏర్పడిరదని మరియు లావాదేవీల నిర్వహణ సులభతరం అయ్యిందని ఆయన అన్నారు. దీనితో రైల్వే మరియు బిడ్డర్ల మధ్య విక్రయాలలో ఫిర్యాదులు మరియు అంతరాలు తగ్గుతాయన్నారు. అంతేకాక భవిష్యత్తులో అత్యధిక లక్ష్యసాధనకు మరింత కృషి చేయాలని జనరల్ మేనేజర్ అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..