Hyderabad: బర్త్‌డే పార్టీ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు.. హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థుల నానా హంగామా..

వారంతం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో యువత రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు పబ్‌లకు మాత్రమే పరిమితమైన వారు ఇప్పుడు రేవ్‌ పార్టీల పేరుతో నానా హంగామా చేస్తున్నారు. హయత్‌ నగర్‌లో వెలుగులోకి వచ్చిన రేవ్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇటీవల కొంతమంది యువకులు..

Hyderabad: బర్త్‌డే పార్టీ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు.. హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థుల నానా హంగామా..
Representative ImageImage Credit source: TV9 Telugu
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2022 | 6:26 AM

వారంతం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో యువత రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు పబ్‌లకు మాత్రమే పరిమితమైన వారు ఇప్పుడు రేవ్‌ పార్టీల పేరుతో నానా హంగామా చేస్తున్నారు. హయత్‌ నగర్‌లో వెలుగులోకి వచ్చిన రేవ్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇటీవల కొంతమంది యువకులు పుట్టిన రోజు వేడుకల పేరుతో రేవ్‌ పార్టీ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన వాళ్లంతా ఇంజనీరింగ్‌ విద్యార్ధులుగా తేలింది. బర్త్‌డే పార్టీ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. రెయిడ్స్‌ జరిగే టైమ్‌లో యువతీ, యువకులు గంజాయి మత్తులో మునిగితేలుతున్నారు.

మొత్తం 29మంది యువకులు, నలుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల దగ్గర్నుంచి 11 కార్లు, ఒక బైక్‌, 28 మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, యువతీ యువకుల తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కి పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయితే, నిందితుల తరపున వచ్చిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులపై రెచ్చిపోయాడు. క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌పై చేయి చేసుకుని తోసేశాడు. మీడియా కవరేజ్‌ చేస్తున్న మీడియాపై కూడా దాడికి దిగాడు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ చెలరేగిపోయాడు.

పోలీస్‌స్టేషన్‌లో వీరంగమాడిన యువకుడిని కుంట్లూర్‌కి చెందిన మణికంఠగా పోలీసులు గుర్తించారు. క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌, మీడియా ప్రతినిధుల ఫిర్యాదుతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీలో గంజాయి సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో రిసార్ట్‌పై పోలీసులు మెరుపు దాడి చేశారు. యువతీ యువకులు గంజాయి సేవిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీళ్ల దగ్గర్నుంచి పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ రెండు ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీ స్టూడెంట్స్‌గా గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్‌ ఇచ్చి విడిచిపెట్టారు. హైదరాబాద్‌ శివార్లలో రేవ్‌ పార్టీ కల్చర్‌ విచ్చలవిడిగా సాగిపోతోంది. రేవ్‌ పార్టీలను నిరోధించేందుకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నాయ్‌. పక్కా సమాచారం అందితే తప్ప, వీటిని అడ్డుకోలేకపోతున్నారు పోలీసులు. ఇప్పుడు ఏకంగా స్టూడెంట్సే రేవ్‌ పార్టీ చేసుకోవడం సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?