TSPSC: తెలంగాణ FSO ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. రాత పరీక్షలో 4 ప్రశ్నలు తొలగింపు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో 24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టులకు నవంబరు 7న ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన..

TSPSC: తెలంగాణ FSO ఫైనల్‌ ఆన్సర్‌ 'కీ' విడుదల.. రాత పరీక్షలో 4 ప్రశ్నలు తొలగింపు
TSPSC FSO Final answer key
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 09, 2022 | 8:53 PM

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో 24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టులకు నవంబరు 7న ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని గత నెల్లోనే 15వ తేదీన టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. దీనిపై నవంబర్‌ 16 నుంచి నవంబర్‌ 20 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలించి, నాలుగు ప్రశ్నలు తొలగించవల్సిందిగా కమిషన్‌కు సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పేపర్‌-1లో మూడు ప్రశ్నలు, పేపర్‌-2లో ఒక ప్రశ్న చొప్పున.. మొత్తం 4 ప్రశ్నలను తొలగించినట్లు స్పష్టం చేసింది.

అనంతరం ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’ శనివారం (డిసెంబర్‌ 3) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లు డిసెంబర్‌ 5 నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. ‘కీ’పై ఇక ఎలాంటి అభ్యంతరాలను పరిశీలించబోమని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.