HCUలో కీచక ప్రొఫెసర్ల కలకలం.. విద్యార్ధుల డిమాండ్లతో అట్టుడిగిపోతున్న యూనివర్సిటీ క్యాంపస్..!
హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ (హెచ్‌సీయూ)లో కీచక ప్రొఫెసర్ రవి రంజన్‌ను వర్సిటీ వీసీ శనివారం (డిసెంబర్ 3) సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రవిరంజన్ నిన్న (శుక్రవారం) రాత్రి..
హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ (హెచ్‌సీయూ)లో కీచక ప్రొఫెసర్ రవి రంజన్‌ను వర్సిటీ వీసీ శనివారం (డిసెంబర్ 3) సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రవిరంజన్ నిన్న (శుక్రవారం) రాత్రి థాయిలాండ్ విద్యార్ధినికి హిందీ నేర్పుతానని నమ్మబలికి తన క్వార్టర్స్ కి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్ధినికి మద్యం తాగించే యత్నం చేసి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విద్యార్ధిని ప్రతిఘటించడంతో ఆమెపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమెను కార్లో తీసుకొచ్చి వర్సిటీ గేటు వద్ద వదిలేశారు. ఈ ఘటనపై బాధిత విద్యార్ధిని పోలీసులను ఆశ్రయించి, సదరు ప్రొఫెసర్‌పై కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాకుండా వీసీకి కూడా మెయిల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రవిరంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో హెచ్‌సీయూ వీసీ బి జగదీశ్వర్‌రావు చర్చలు జరిపారు. రవి రంజన్ లాంటి కీచక ప్రొఫెసర్లు వర్సిటీలో మరికొందరు ఉన్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ.. వాళ్లపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి వారిసంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలన్న స్టూడెంట్స్ డిమాండ్ మేరకు ప్రొఫెసర్ రవి రంజన్‌కు సస్పెష్షన్ ఉత్తర్వులు వీసీ జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.