AP Inter Exam Fee 2023: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ సెకండియర్‌ పరీక్ష ఫీజు పెంపు.. తేదీల వారీగా పూర్తి షెడ్యూల్‌ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫీజు చెల్లింపులు డిసెంబ‌రు 19 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు. ఈ మేరకు పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను..

AP Inter Exam Fee 2023: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ సెకండియర్‌ పరీక్ష ఫీజు పెంపు.. తేదీల వారీగా పూర్తి షెడ్యూల్‌ ఇదే..
AP Inter Board
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 03, 2022 | 4:17 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫీజు చెల్లింపులు డిసెంబ‌రు 19 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు. ఈ మేరకు పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను డిసెంబర్‌ 1న విడుదల చేశారు. అంతేకాకుండా 2023 మార్చి నెలలో ప్రారంభమయ్యే ఇంటర్‌ ప్రథమ, ద్వితియ పరీక్ష ఫీజులను పెంచినట్లు ఆయన తెలిపారు. గతేడాది రెగ్యులర్ విద్యార్థులు జనరల్ కోర్సులకు ఫీజు రూ.700 ఉండగా దానిని రూ.720కి పెంచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులకు రూ.1200 ఫీజును రూ.1230కి పెంచారు. వొకేషనల్ విద్యార్థులకు రూ.700 నుంచి రూ. 720కి, ప్రాక్టికల్స్ ఫీజు రూ. 200 నుంచి రూ. 210 పెంచారు. ఇంప్రూవ్మెంట్ పరీక్షకు ఆర్ట్స్ విద్యార్థులు గతేడాది రూ.1200 చెల్లించగా ఇప్పుడు రూ.1230 చెల్లించాలి. సైన్స్ విద్యార్థులకు రూ.1430 చెల్లించవల్సి ఉంటుంది.

పెరిగిన ఫీజుల ప్రకారం ఫీజుల వివరాలు ఇవే..

  • డిసెంబర్ 19వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు
  • రూ.120 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 26వ తేదీ వరకు
  • రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 1వ తేదీ వరకు
  • రూ.1000 ఆలస్య రుసుముతో జనవరి 9 వరకు
  • రూ.2 వేల ఆలస్య రుసుముతో జనవరి 17 వరకు
  • రూ.3 వేల ఆలస్య రుసుముతో జనవరి 23 వరకు
  • రూ.5 వేల ఆలస్య రుసుముతో జనవరి 30 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.