AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KVS Recruitment 2022: నిరుద్యోగులకు కొలువుల జాతర! కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి..

టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి బంపరాఫర్‌! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో.. 13,404 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ (ప్రిన్సిపల్‌, టీజీటీ, పీజీటీ, లైబ్రేరియన్‌ తదితర) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

KVS Recruitment 2022: నిరుద్యోగులకు కొలువుల జాతర! కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి..
Kendriya Vidyalaya Sangathan
Srilakshmi C
|

Updated on: Dec 03, 2022 | 5:58 PM

Share

టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి బంపరాఫర్‌! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో.. 13,404 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ (ప్రిన్సిపల్‌, టీజీటీ, పీజీటీ, లైబ్రేరియన్‌ తదితర) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ ప్రకటనను జారీ చేసింది. పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ డిప్లొమా/బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్‌సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్నవారికి వయోపరిమితి విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 26, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రిన్సిపల్‌, వైస్‌-ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.2300లు, పీఆర్టీ/టీజీటీ/పీజీటీ/ఫైనాన్స్‌ ఆఫీసర్‌/ఏఈ/లైబ్రేరియన్‌/ఏఎస్‌ఓ/హెచ్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ప్రిన్సిపల్‌ పోస్టులు: 239
  • వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులు: 203
  • పీజీటీ పోస్టులు: 1409
  • టీజీటీ పోస్టులు: 3176
  • లైబ్రేరియన్‌ పోస్టులు: 355
  • ప్రైమరీ టీచర్‌ పోస్టులు: 6414
  • అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు: 52
  • పీఆర్టీ (మ్యూజిక్‌) పోస్టులు: 303
  • ఫినాన్స్‌ ఆఫీసర్ పోస్టులు: 6
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టులు: 2
  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్ (ఏఎస్‌ఓ) పోస్టులు: 156
  • హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు: 11
  • సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (యూడీడీ) పోస్టులు: 322
  • జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎల్డీసీ) పోస్టులు: 702
  • స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-II పోస్టులు: 54

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..