Telangana: అమ్మాయిది ఆత్మహత్య అనుకున్నారంతా.. కట్ చేస్తే వెలుగులోకి షాకింగ్ నిజాలు..
పల్లెబాటలో అలజడి రేగింది. ఓవైపు కట్టలు తెగిన దు:ఖం.. మరోవైపు విధ్వంసం.. ఇందుకు కారణం ఓ నిండు ప్రాణం బలికావడమే. ఆ ప్రాణం పోవడానికి కారకులైన..
పల్లెబాటలో అలజడి రేగింది. ఓవైపు కట్టలు తెగిన దు:ఖం.. మరోవైపు విధ్వంసం.. ఇందుకు కారణం ఓ నిండు ప్రాణం బలికావడమే. ఆ ప్రాణం పోవడానికి కారకులైన వారిపై పెల్లుబికిన ఆగ్రహం మంటలై ఎగిసింది. ఆ నీచ్ కమీనే గాళ్లు చేసిన నిర్వాకానికి ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. బంధువులే బంగారం లాంటి బిడ్డను బలితీసుకున్నారని ఊరు ఊరంతా రగిలిపోయింది. తొలుత అంతా ఆత్మహత్య అనుకున్నారు. కానీ, అసలు విషయం తెలియడంతో గ్రామస్తులు రగిలిపోయారు. ఆ కీచకుల అంతు చూడాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని చినరేవళ్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చినరేవళ్లి గ్రామంలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ అర్ధాంతరంగా చనిపోయింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలియక.. అందరూ ఆత్మహత్య అనుకున్నారు. కానీ అసలు కారణం ఏంటో ఆ తరువాత తెరపైకి వచ్చింది. ఆమెది ఆత్మహత్యకాదు. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేసి ఆత్మహత్యగా వక్రీకరించారనే వాస్తవం బయటపడటంతో ప్రజల ఆగ్రహం మత్తడి దుంకింది. సమాచారం అందుకున్న పోలీసులు ఊళ్లోకి వచ్చారు. విద్యార్ధినీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించేందుకు యత్నించారు. కానీ కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన ఆ ముగ్గురినీ కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు.
శ్రీనివాస్, శివ, హర్యా అనే ముగ్గురు మృగాళ్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారన్నది బంధువుల ఆరోపణ. ఆ ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీళ్లలో శ్రీనివాస్.. చనిపోయిన అమ్మాయికి వరసకు బాబాయి అవుతాడు. మరొడకు అన్నయ్య వరుస అవుతాడు. అయితే, గతంలో తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది మృతురాలి సోదరి. ఆ ముగ్గుర్ని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారామె. గ్యాంగ్ రేప్ ఆరోపణల క్రమంలో పాలమూరు జిల్లా తిరుమలగిరి ఆందోళనలతో అట్టుడికింది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మరోవైపు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. నిజానిజాలు తేల్చి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఆ ముగ్గురు మృగాళ్లను కఠినంగా శిక్షించే వరకు ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు స్థానికులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..