AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆముదంలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు.. చింపిరి జుట్టు కాస్తా ఒత్తుగా, బలంగా పెరుగుతుంది..

పొడి జుట్టు, జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? కర్పూరం, అలోవెరా జెల్, ఆముదం, విటమిన్‌-ఈ ఆయిల్‌తో తయారు చేసే హెయిర్‌ మాస్క్‌ జుట్టుకు తేమను అందించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌, జుట్టుకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత మైల్డ్‌ షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు.

ఆముదంలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు.. చింపిరి జుట్టు కాస్తా ఒత్తుగా, బలంగా పెరుగుతుంది..
Camphor Hair Mask
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2026 | 11:11 AM

Share

మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు పొడిబారడం, బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొడి జుట్టు తరచుగా చిట్లిపోవడం, గడ్డిలా చింపిరిగా మారడం జరుగుతుంది. ఈ సమస్యలకు సరళమైన, సమర్థవంతమైన పరిష్కారం కర్పూరం హెయిర్ మాస్క్.. ఇది జుట్టుకు అవసరమైన తేమను అందించి, ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్క్ ద్వారా.. జట్టు రాలడం తగ్గడంతోపాటు.. ఒత్తుగా పెరుగుతుంది.

ఈ హెయిర్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు: కర్పూరం, అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్ (ఆముదం), విటమిన్ ఇ ఆయిల్..

ముందుగా, కర్పూరాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. కర్పూరం స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మూసుకుపోయిన హెయిర్ ఫాలికల్స్‌ను తెరిచి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు చిట్లడం, బలహీనపడటం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్ జుట్టుకు పోషణను అందించి, తేమను నిలుపుకోవడానికి తోడ్పడతాయి.

ఎలా ఉపయోగించాలంటే..

కర్పూరం, అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్ (ఆముదం), విటమిన్ ఇ ఆయిల్.. అన్ని పదార్థాలను కలిపి క్రీమీ టెక్స్‌చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, స్కాల్ప్‌కు పూర్తిగా పట్టించాలి.

పది నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా అన్ని కాలాలలో జుట్టు పొడిబారకుండా ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

అయితే కర్పూరం నేరుగా స్కాల్ప్‌పై ఉపయోగించడం వల్ల కొందరికి చికాకు లేదా అలర్జీ కలగవచ్చు కాబట్టి ముందుగా చిన్న ప్రాంతంలో ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆముదంలో ఇదొక్కటి కలిపి రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
ఆముదంలో ఇదొక్కటి కలిపి రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
భర్తను మత్తులోకి పంపి.. బ్యాట్‌తో కొట్టి చంపి ఇంట్లోనే పాతేసింది!
భర్తను మత్తులోకి పంపి.. బ్యాట్‌తో కొట్టి చంపి ఇంట్లోనే పాతేసింది!
మీకు పొట్టి పింజర పాముల గురించి తెలుసా..?
మీకు పొట్టి పింజర పాముల గురించి తెలుసా..?
అమెరికా సైనికులను పట్టిస్తే లకాధికారిని చేస్తాం! ఇరాన్ ఆఫర్!
అమెరికా సైనికులను పట్టిస్తే లకాధికారిని చేస్తాం! ఇరాన్ ఆఫర్!
చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది
చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది
చెవులకు కమ్మలు..మెడలో కోటర్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు
చెవులకు కమ్మలు..మెడలో కోటర్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు
శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు..
శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు..
RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. డైరెక్ట్ లింక్
RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. డైరెక్ట్ లింక్
బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం..
తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం..