నాటు కోడి గుడ్లను ఎలా గుర్తించాలి? ఇవే సింపుల్ ట్రిక్స్!

19 Oct 2026

Anand T

గుడ్డు ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్‌లో మనకు రెండు రకాల గుడ్లు దొరుకుతాయి. ఒకటి నాటు కోడి, మరోటి బాయిలర్ కోడివి.

కోడి గుడ్లు

అయితే బ్రాయిలర్ కోడి గుడ్లతో పోల్చుకుంటే నాటు కోడి గుడ్లకు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మందికి అసలైన నాటు కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలియదు

నాటు కోడి గుడ్లు

నాటు కోడి గుడ్డు పెంకు సాధారణంగా గోధుమ లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది. దీనిపై కొద్దిగా గరుకుగా ఉండి, సహజమైన కాంతితో కనిపిస్తుంది.

పెంకు రంగు

పౌల్ట్రీ లేదా ఫామ్‌లో పెంచే కోళ్లు పెట్టే గుడ్లు స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి. వీటి పెంకు చాలా నునుపుగా, ఒకే తీరుగా కనిపిస్తుంది.

ఫామ్ గుడ్లు

నాటు కోడి గుడ్లు పరిమాణంలో కొంచెం చిన్నవిగా ఉంటాయి. అంతేకాకుండా, అన్ని గుడ్లు ఒకే విధమైన ఆకారం లేదా సైజులో ఉండవు.

పరిమాణం

ఫామ్ గుడ్లు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. అవన్నీ దాదాపు ఒకే సైజులో, ఒకే రకమైన ఆకారంలో సమానంగా కనిపిస్తాయి.

ఫామ్ గుడ్ల ఆకారం

నాటు కోడి గుడ్డులోని పచ్చసొన (Yolk) ముదురు పసుపు లేదా దాదాపు నారింజ రంగుకు దగ్గరగా గాఢంగా ఉంటుంది.నాటు కోళ్లు బయట తిరుగుతూ సహజమైన గడ్డి, కీటకాలను తినడం వల్ల పచ్చసొన గాఢంగా మారుతుంది. అదే ఫామ్ గుడ్ల పచ్చసొన చాలా లేత పసుపు రంగులో ఉంటుంది.

పచ్చసొన రంగు

నాటు గుడ్డును పగలగొట్టినప్పుడు దాని తెల్లసొన కాస్త చిక్కగా ఉంటుంది. లోపలి పచ్చసొన కూడా త్వరగా చెదిరిపోకుండా గట్టిగా నిలకడగా ఉంటుంది. ఈ సింపుల్ తేడాలతో మీరు ఈజీగా నాటుకోడి గుడ్డును గుర్తించొచ్చు.

తెల్లసొన