AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే టికెట్ల బుకింగ్స్‌లో భారీ మార్పు.. దీపావళికి ముందే అమల్లోకి.. రైల్వేశాఖ కొత్త నిబంధనలు..

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 27వ తేదీ టికెట్ల బుకింగ్స్‌కు కొత్త రూల్ అమల్లోకి రానుంది. దీపావళికి ముందు రైల్వే టికెట్‌లో కొత్త మార్పులు వస్తున్నాయి. దీంతో ఈ మార్పుల గురించి ప్రయాణికులందరూ తెలుసుకోవాలి. ఈ కొత్త నిబంధనలు ఏంటనేది చూద్దాం.

Indian Railways: రైల్వే టికెట్ల బుకింగ్స్‌లో భారీ మార్పు.. దీపావళికి ముందే అమల్లోకి.. రైల్వేశాఖ కొత్త నిబంధనలు..
Indian Railway Tickets
Venkatrao Lella
|

Updated on: Oct 19, 2026 | 10:42 PM

Share

రైలు ప్రయాణాలు చేసేవారందరూ తెలుసుకోవాల్సిన విషయమిది. ఎందుకంటే దీపావళికి ముందే రైలు టికెట్ నిబంధనలు మారుతున్నాయి. మీరు ట్రైన్లో ప్రయాణించేందుకు టికెట్ తీసుకునేటప్పుడు దీనిని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అక్టోబర్ 27వ తేదీ నుంచి టికెట్లకు కొత్త నిబంధన అమల్లోకి వస్తోంది. రైల్వేశాఖ ఒక పెద్ద మార్పు చేపడుతోంది. రైళ్లల్లో తరచూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వీరి భద్రత దృష్ట్యా ఇండియన్ రైల్వే అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తోంది. రైలు ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లినప్పుడు ఈ బీమా పొందవచ్చు. అయితే ఇప్పటివరకు ఆన్‌లైన్‌ టికెట్లకు మాత్రమే అందుబాటులో ఉన్న బీమా సౌకర్యం.. ఇక నుంచి ఆప్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు కూడా అందుబాటులోకి రానుంది.

ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే ప్రయాణ బీమాను ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ఎంచుకున్న ప్రయాణికులకు బీమా వర్తిస్తుంది. ఒకవేళ రైలు ప్రయాణంలో అనుకోని ఘటన జరిగి ప్రయాణికుడు మరణిస్తే కుటుంబసభ్యులకు బీమా కవరేజీ అందిస్తారు. ఇక ప్రయాణికుడు గాయపడినా బీమా సొమ్ము అందుతుంది. అయితే ఇప్పటివరకు ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉన్న బీమా కవరేజీ.. ఇప్పుడు ఆప్‌లైన్ టికెట్లకు కూడా వర్తింపచేయనున్నారు. ఇక నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి కూడా ప్రయాణ బీమా సౌకర్యం కల్పించనున్నారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవారికి అక్టోబర్ 27వ తేదీ నుంచి బీమా కవరేజీ దక్కనుంది.

ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల క్రమంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 2023లో ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా అన్ని టికెట్లపై బీమా అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం రైల్వేశాఖ ఇక నుకంచి ఆప్ లైన్ టికెట్లకు కూడా బీమా కవరేజీ కల్పించనుంది. ఈ బీమా కవరేజీ ప్రీమియం 45 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రయాణికుడు మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా రూ.10 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. ఇక పాక్షికంగా గాయపడినా బీమా వస్తుంది. టికెట్ ధరలతో పాటు ఈ ప్రీమియం సొమ్మును కూడా తీసుకుంటారు. మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత మీ మొబైల్ లేదా మెయిల్ ఐడీకి పాలసీ వివరాలు అందుతాయి. ఆ వివరాల ఆధారంగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Follow Us
మారనున్న రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్.. దీపావళికి ముందే అమల్లోకి
మారనున్న రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్.. దీపావళికి ముందే అమల్లోకి
కొత్త బోర్లకు పర్మిషన్ ఇవ్వొద్దు.. అధికారులకు సీఎస్‌ కీలక ఆదేశాలు
కొత్త బోర్లకు పర్మిషన్ ఇవ్వొద్దు.. అధికారులకు సీఎస్‌ కీలక ఆదేశాలు
క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసి క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఎలా
క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసి క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఎలా
Video: ఓ వైపు తన పెళ్లి.. మాజీ ప్రియురాలితో తన బిడ్డ వేడుక!
Video: ఓ వైపు తన పెళ్లి.. మాజీ ప్రియురాలితో తన బిడ్డ వేడుక!
సగం యూరప్‌కి అల్లర్ల క్యాన్సర్.. ఎందుకోసం ఈ అంతర్యుద్ధం?
సగం యూరప్‌కి అల్లర్ల క్యాన్సర్.. ఎందుకోసం ఈ అంతర్యుద్ధం?
ఎముకల బలానికి, ఒంట్లో కొవ్వును కరిగించడానికి ఉలవల రైస్
ఎముకల బలానికి, ఒంట్లో కొవ్వును కరిగించడానికి ఉలవల రైస్
చికెన్, మటన్ కీమాను తలపించేలా ఎగ్ కీమా కర్రీ.. 
చికెన్, మటన్ కీమాను తలపించేలా ఎగ్ కీమా కర్రీ.. 
కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఈ చిన్న మార్పులు చేసి చూడండి
కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఈ చిన్న మార్పులు చేసి చూడండి
ఫ్యూచర్ సిటీలో కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రారంభించిన సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీలో కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రారంభించిన సీఎం రేవంత్
వ్యాయామం చేస్తే కీళ్లు అరిగిపోతాయా? వైద్యులు ఏమంటున్నారు?
వ్యాయామం చేస్తే కీళ్లు అరిగిపోతాయా? వైద్యులు ఏమంటున్నారు?