AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Keema Curry: చికెన్, మటన్ కీమాను తలపించేలా ఎగ్ కీమా కర్రీ.. నోట్లో పెట్టుకోగానే ఆహా అనాల్సిందే

గుడ్డుతో ఎన్ని రకాల వంటలు చేసినా ఇంకా కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలనిపిస్తూనే ఉంటుంది. సాధారణంగా ఇంట్లో కోడిగుడ్డు కూర అంటే ఉడకబెట్టి వేపుడు చేయడం లేదా పులుసు పెట్టడం చేస్తుంటాం. కానీ కాస్త భిన్నంగా ధాబా శైలిలో 'ఎగ్ కీమా కర్రీ' వండితే నాన్‌వెజ్ ప్రియులు సైతం చికెన్, మటన్ కీమాను మర్చిపోయి లొట్టలేసుకుంటూ తింటారు. ఇందులో ప్రధానమైన రహస్యం గుడ్లను వేయించే పద్ధతిలోనే ఉంటుంది. గుడ్ల మిశ్రమాన్ని నూనెలో వేసిన వెంటనే వేగంగా గరిటెతో కలిపేస్తే చిన్న చిన్న పొడిలా మారిపోయి గ్రేవీలో కలిసిపోతుంది. 

Phani CH
|

Updated on: Oct 19, 2026 | 9:26 PM

Share
కావలసిన పదార్థాలు:  6 కోడిగుడ్లు, 2 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు , 2 ముక్కలుగా తరిగిన పచ్చిమిరపకాయలు, 2 బాగా పండిన టమాటాలు, 1 చిన్న టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం పొడి, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 చిన్న టీ కప్పుల నీళ్లు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 6 నుండి 7 రెబ్బల కరివేపాకు , 2 స్పూన్ల వంట నూనె

1 / 5
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగే లోపు ఒక గిన్నెలో 6 గుడ్లను పగలగొట్టి ఫోర్క్ లేదా స్పూన్‌తో బాగా గిలకొట్టాలి. నూనె వేడయ్యాక ఈ ఎగ్ మిశ్రమాన్ని పోయాలి. వేసిన వెంటనే కలపకుండా.. మీడియం మంటపై కాస్త గట్టిపడ్డాక గరిటెతో పెద్ద పెద్ద ముక్కలుగా తుంచుకుంటూ మధ్యమధ్యలో మాత్రమే కలుపుతూ వేయించాలి. గుడ్డు నీచు వాసన పోయి, ముక్కలు అక్కడక్కడా ఎర్రగా క్రిస్పీగా మారే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
అదే కడాయిలో 5-6 స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం మంటపై 2 నిమిషాలు ఉల్లిపాయలు మెత్తబడి పింకిష్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత 1 చిన్న టీస్పూన్ తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్‌పై పచ్చివాసన పోయి సువాసన వచ్చేలా వేయించాలి. ఇప్పుడు 2 టమాటాల ప్యూరీని వేసి మీడియం ఫ్లేమ్‌పై నూనె వేరుపడేంత వరకు 2-3 నిమిషాలు మగ్గించాలి.

3 / 5
టమాటా మగ్గిన తర్వాత మంటను సిమ్‌లో ఉంచి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి నూనె తేలే వరకు లో ఫ్లేమ్‌పై 2 నిమిషాలు వేయించాలి. మసాలాలు వేగిన తర్వాత 2 చిన్న టీ కప్పుల నీళ్లు పోసి కలపాలి. మీడియం-లో ఫ్లేమ్‌పై గ్రేవీ కాస్త చిక్కబడి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

4 / 5
గ్రేవీ సరైన పదం వచ్చాక.. ముందుగా వేయించి ఉంచుకున్న ఎగ్ కీమా ముక్కలను వేయాలి. మరీ ఎక్కువగా కలపకుండా సున్నితంగా కలిపి, లో ఫ్లేమ్‌పై 2 నుండి 3 నిమిషాలు కుతకుతా ఉడకనివ్వాలి. దీనివల్ల గ్రేవీ రసమంతా ఎగ్ ముక్కల్లోకి ఇంకుతుంది. చివరగా తాజా కొత్తిమీర తరుగు, 6-7 కరివేపాకు రెబ్బలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారే కొద్దీ ఈ గ్రేవీ మరింత చిక్కబడుతుంది. అంతే, నోరూరించే ధాబా స్టైల్ 'ఎగ్ కీమా కర్రీ' సిద్ధం! వేడివేడి చపాతీలు, లేయర్ పరోటా, బగారా రైస్ లేదా దోశల్లోకి వడ్డించుకుని తింటుంటే ప్రతి ముద్ద అమృతతుల్యంగా ఉంటుంది!

5 / 5
Follow Us
చికెన్, మటన్ కీమాను తలపించేలా ఎగ్ కీమా కర్రీ.. 

కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఈ చిన్న మార్పులు చేసి చూడండి

ఫ్యూచర్ సిటీలో కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రారంభించిన సీఎం రేవంత్

వ్యాయామం చేస్తే కీళ్లు అరిగిపోతాయా? వైద్యులు ఏమంటున్నారు?

హైదరాబాద్‌లో భారీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఎక్కడంటే..?

రోజూ లేట్‌గా పడుకుంటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త!

5 నిమిషాల్లో కుక్కర్‌లో చేసుకునే కమ్మనైన తోటకూర టమాటా కూర

పుల్లపుల్లగా, కారంగా నోటికి భలే రుచిగా ఉండే చల్ల పిండి

50టీస్‌లోనూ 20టీస్‌లా ఫిట్‌గా కనిపించాలా?.. జస్ట్ ఇలా చేస్తే చాలు

రాత్రిపూట పురుషులు గూగుల్‌లో ఎక్కువగా దేని కోసం వెతుకుతారో తెలుసా