AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 నిమిషాల్లో కుక్కర్‌లో చేసుకునే తోటకూర టమాటా కూర.. వేడి అన్నంలోకి అదిరిపోయే టేస్ట్

ఆకుకూరల్లో పోషకాల పరంగా అత్యధికంగా ఇష్టపడే ఆకుకూర తోటకూర. ఐరన్, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండే తోటకూరతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే చాలామంది తోటకూరతో కేవలం పప్పు లేదా వేపుడు మాత్రమే చేస్తుంటారు. కానీ రాయలసీమ, పల్లెటూరి సంప్రదాయ పద్ధతిలో ఎక్కువ గుజ్జు ఉండే నాటు టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి 'తోటకూర టమాటా కూర' వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. 

Phani CH
|

Updated on: Oct 19, 2026 | 9:15 PM

Share
కావలసిన పదార్థాలు: 1 పెద్ద కట్ట సన్నగా తరిగిన తాజా తోటకూర, 3 నుండి 4 చిన్న ముక్కలుగా తరిగిన టమాటాలు, 1 మీడియం సైజు  సన్నగా తరిగిన ఉల్లిపాయ, కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, 6 నుండి 7 వెల్లుల్లి రెబ్బలు, 10 రెబ్బలు కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజు అంత కడిగి నానబెట్టిన చింతపండు, అర టీస్పూన్ ఆవాలు & జీలకర్ర, ర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 4 నుండి 5 చెంచాల వంట నూనె 

1 / 5
తయారీ విధానం: స్టవ్‌పై చిన్న కుక్కర్ పెట్టి 4 నుండి 5 చెంచాల నూనె వేడిచేయాలి. కుక్కర్‌లో కాకపోయినా కడాయిలోనైనా చేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ వెంటనే చితక్కొట్టిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, తాజా కరివేపాకు వేసి మాడకుండా వేయించాలి. ఆ తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన 3 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మృదువుగా వేగే వరకు మీడియం మంటపై వేయించాలి.

2 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్నగా తరిగిన 3-4 పండిన టమాటా ముక్కలు వేయాలి. ముక్కలు త్వరగా మగ్గడానికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు, కారానికి తగినంత కారం పొడి వేయాలి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు చింతపండును వేసి కలపాలి. మూతపెట్టి లో ఫ్లేమ్‌పై టమాటాలు మెత్తని గుజ్జులా మారే వరకు మగ్గించాలి.

3 / 5
టమాటా గుజ్జు మగ్గిన తర్వాత.. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేయాలి. ఇక్కడ అదనంగా నీళ్లు పోయకూడదు; తోటకూరలోని తేమే ఉడకడానికి సరిపోతుంది. మూతపెట్టి లో ఫ్లేమ్‌లో 1-2 నిమిషాలు ఉంచితే ఆకు మెత్తబడి కుంచించుకుపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టి.. చిన్న కుక్కర్ అయితే లో ఫ్లేమ్‌పై 2 విజిల్స్, లేదా మీడియం కుక్కర్ అయితే మీడియం ఫ్లేమ్‌పై 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.

4 / 5
ఆవిరి దానంతట అదే పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. స్టవ్ పైనుంచి పక్కకు దించి.. పప్పుగుత్తితో మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా అక్కడక్కడా ఆకులు, టమాటా ముక్కలు కనిపించేలా కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి. ఉప్పు, కారాలు సరిచూసుకుని.. పులుపుకు తగ్గట్టు ఉప్పు లేదా కారం సరిపోకపోతే కొద్దిగా వేసి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లాలి. మళ్లీ స్టవ్‌పై పెట్టి ఒక్క నిమిషం వేడెక్కేలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మనైన పల్లెటూరి శైలి 'తోటకూర కర్రీ' సిద్ధం! వేడివేడి రాగి సంగటిలో ఈ కూర వేసుకుని తిన్నా, వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తిన్నా లేదా చపాతీల్లోకి నంజుకున్నా అమృతతుల్యంగా ఉంటుంది!

5 / 5
Follow Us
రోజూ లేట్‌గా పడుకుంటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త!

5 నిమిషాల్లో కుక్కర్‌లో చేసుకునే కమ్మనైన తోటకూర టమాటా కూర

పుల్లపుల్లగా, కారంగా నోటికి భలే రుచిగా ఉండే చల్ల పిండి

50టీస్‌లోనూ 20టీస్‌లా ఫిట్‌గా కనిపించాలా?.. జస్ట్ ఇలా చేస్తే చాలు

రాత్రిపూట పురుషులు గూగుల్‌లో ఎక్కువగా దేని కోసం వెతుకుతారో తెలుసా

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో వినిపిస్తున్న అనిల్ పండిట్ పేరు

సాలీడుకి నిప్పు పెట్టబోయి.. రూ.కోటి విల్లా బూడిదపాలు!

ఐస్‌క్రీమ్‌తో భార్యను ఆటపట్టించిన ధోనీ..సాక్షి రియాక్షన్ అదిరింది

బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
ఆకులే బంగారం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?