AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Challa Pindi: పుల్లపుల్లగా, కారంగా నోటికి భలే రుచిగా ఉండే  పాతకాలపు వంటకం చల్ల పిండి

గోదావరి జిల్లాల్లో పూర్వం నుంచి వస్తున్న ఎన్నో ప్రాచీన వంటకాల్లో 'చల్ల పిండి'. దీనినే మజ్జిగ పిండి అని కూడా అంటారు చాలా ప్రసిద్ధి చెందినది. ఇంట్లో మజ్జిగ బాగా పులిసిపోయినప్పుడు పారబోయకుండా.. బియ్యప్పిండితో కలిపి అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్‌లా ఈ వంటకాన్ని చేసేవారు. పుల్లటి మజ్జిగ రుచికి సరిపడా పచ్చిమిరపకాయల కారం, అల్లం మరియు ఎండుమిర్చి ఘాటు తోడైతే చల్ల పిండి రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ వంటకానికి పక్కా కొలతలు చాలా ముఖ్యం. ఒక గ్లాసు బియ్యప్పిండికి ఒకటిన్నర నుండి రెండు గ్లాసుల వరకు పుల్లటి మజ్జిగ, నీరు కలిపి జారుడుగా కలుపుకోవాలి. 

Phani CH
|

Updated on: Oct 19, 2026 | 9:06 PM

Share
కావలసిన పదార్థాలు: 1 గ్లాసు పొడి బియ్యప్పిండి, పుల్లటి మజ్జిగ 2 గ్లాసులు, 1 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ,  3 నుండి 4 సన్నగా ఎండు మిరపకాయలు, 1 టేబుల్  స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు, 3 తుంచిన పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ ఆవాలు , అర టీస్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వంట నూనె, 

1 / 5
తయారీ విధానం: ఒక గిన్నెలో 1 గ్లాసు బియ్యప్పిండిని తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి.. ఒకటిన్నర గ్లాసుల పుల్లటి మజ్జిగను పోసి ఉండలు ఏమీ లేకుండా విస్కర్ లేదా గరిటెతో బాగా కలపాలి. పిండి చిక్కగా అనిపిస్తే మరో పావు గ్లాసు నుండి అర గ్లాసు వరకు నీరు లేదా మజ్జిగ పోసుకుని పలుచటి జారుడు పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
స్టవ్‌పై వెడల్పాటి కడాయి లేదా పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. పప్పులు ఎర్రగా వేగాక తుంచిన ఎండుమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు మృదువుగా, లేత గులాబీ రంగులోకి మారేంత వరకు లో-మీడియం మంటపై మగ్గించాలి.

3 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న చల్ల-బియ్యప్పిండి మిశ్రమాన్ని కడాయిలో పోయాలి. పోసే ముందు పిండిని ఒకసారి కలపాలి, అడుగున పిండి తేలిపోకుండా ఉంటుంది. పోసిన వెంటనే ఉండలు కట్టకుండా గరిటెతో ఆపకుండా కలుపుతూనే ఉండాలి.

4 / 5
మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతుంటే నిమిషాల వ్యవధిలోనే పిండి దగ్గరపడటం మొదలవుతుంది. పిండి చక్కగా ఉడికి కడాయి అంచులకు అంటుకోకుండా ముద్దలా విడివడే వరకు నిరంతరం కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే పాతకాలపు గోదావరి 'చల్ల పిండి' సిద్ధం! పుల్లపుల్లగా, కారంగా వేడివేడిగా తింటుంటే నాలుకకు అద్భుతమైన రుచినివ్వడమే కాకుండా.. దీనిపై చెంచాడు నెయ్యి లేదా ఆవకాయ నూనె వేసుకుని తింటే అమృతతుల్యంగా ఉంటుంది !

5 / 5
Follow Us
పుల్లపుల్లగా, కారంగా నోటికి భలే రుచిగా ఉండే చల్ల పిండి

50టీస్‌లోనూ 20టీస్‌లా ఫిట్‌గా కనిపించాలా?.. జస్ట్ ఇలా చేస్తే చాలు

రాత్రిపూట పురుషులు గూగుల్‌లో ఎక్కువగా దేని కోసం వెతుకుతారో తెలుసా

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో వినిపిస్తున్న అనిల్ పండిట్ పేరు

సాలీడుకి నిప్పు పెట్టబోయి.. రూ.కోటి విల్లా బూడిదపాలు!

ఐస్‌క్రీమ్‌తో భార్యను ఆటపట్టించిన ధోనీ..సాక్షి రియాక్షన్ అదిరింది

బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
ఆకులే బంగారం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?

ఏటీఎం మెషిన్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..?

పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే..