AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెన్‌జీ జాతర.. సగం యూరప్‌కి అల్లర్ల క్యాన్సర్.. ఎందుకోసం ఈ అంతర్యుద్ధం?

యూరప్‌లో యువత నిరసనలు, ఆర్థిక అసంతృప్తి, జీవన వ్యయాల పెరుగుదలపై చర్చ మొదలైంది. ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, అల్బేనియా వంటి దేశాల్లో నిరసనలకు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇళ్ల అద్దెలు, విద్యా ఖర్చులు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ధనికులు, పేదల మధ్య పెరుగుతున్న అంతరం, యువతకు ఉపాధి అవకాశాల కొరత కూడా ఆందోళనలకు దారితీస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

జెన్‌జీ జాతర.. సగం యూరప్‌కి అల్లర్ల క్యాన్సర్.. ఎందుకోసం ఈ అంతర్యుద్ధం?
Europe Gen Z Protests 2026
Ram Naramaneni
|

Updated on: Oct 19, 2026 | 9:40 PM

Share

సరిగ్గా ఏడాది కిందట ఇజ్రాయెల్ వరసబెట్టి భీకర దాడులు చేస్తుంటే గాజా ప్రాంతం చితికిపోతుంటే, ఎక్కడో ఉన్న యూరప్‌ ఖండం తల్లడిల్లింది. యూదు వ్యతిరేకులు, పాలస్తీనా సానుభూతిపరులు ఒక్కతాటిమీదకొచ్చి, యూరోపియన్ సిటీస్ అంతటా రోడ్డెక్కి రచ్చరచ్చ జేశారు. రెండేళ్లలో 67 వేలమందిని చంపి, గాజాను శిథిలావస్థకు చేర్చినందుకు ఇజ్రాయెల్‌పై భగ్గుమన్నారు. వేలమంది జైలుపాలయ్యారు కూడా. కానీ, అది తమదికాని గాజా గడ్డకు సంఘీభావం చెబుతూ చేసిన గొడవ. కానీ, ఇప్పుడైతే పక్కా లోకల్. సొంత ఈతి బాధల నుంచి విముక్తి కోసం పోరుబాట పట్టింది ఐరోపా దేశాల్లో పీడిత జనం. వీళ్లకు ఊతకర్రగా నిలబడింది ఉడుకునెత్తురున్న నవ యువతరం. ఫలితం ఏంటంటే, రావణకాష్టంలా మండుతోంది సగానికిపైగా ఐరోపా ఖండం. లిమోజెస్ రాజ భవనం.. ఫ్రెంచ్‌లోని హిస్టారికల్ టౌన్‌హాల్.. నిన్నమొన్నటిదాకా వరల్డ్ క్లాస్ టూరిస్ట్ స్పాట్.. 1876 నుంచి ఫ్రాన్స్ వింటేజ్ కల్చర్‌కి కేరాఫ్‌నంటూ నిటారుగా నిలబడింది. ఇప్పుడు… ఇలా కుప్పకూలిపోయింది. 143 ఏళ్ల పాటు ప్రపంచ యుద్ధాలను కూడా తట్టుకుని గట్టిగా నిలబడ్డ పురాతన భవనం. మోడ్రన్ ఫ్రాన్స్‌కి మాత్రం తడబడింది. నిరసన మంటల్లో పడి మాడి మసైపోయింది. లిమోజెస్ బిల్డింగ్, బూడిదవ్వక ముందు, బూడిదైన తర్వాత అంటూ రెండు దృశ్యాలనూ చూసుకుని గొల్లుమంటోంది ఫ్రాన్స్. ఫ్రాన్స్‌లో ఇటువంటి శిథిల చిత్రాలు ఒకటా రెండా? లెక్కకుమించి. పారిస్‌ నగరానికి మణిమకుటంలాంటి ఈఫిల్ టవర్ దగ్గరైతే వేలమంది గుమిగూడి మంటలు పెట్టి, అంతులేని హింసకు పాల్పడ్డారు. నాటోన్లీ ఫ్రాన్స్…...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి