AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాసర ఆలయంలో ఆలయంలో మరో గోల్‌మాల్‌.. ప్రసాధ సామాగ్రిని మాయం చేసిన సిబ్బంది!

నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో గోల్‌మాల్‌ తెరపైకి వచ్చింది. ప్రసాదం తయారీ సరుకుల చోరీ వ్యవహారం చర్చకు దారి తీసింది. లడ్డూ, పులిహోర తయారీ కోసం తెచ్చిన సరుకులను కొందరు సిబ్బంది బయట షాపులో విక్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బాసర ఆలయంలో ఆలయంలో మరో గోల్‌మాల్‌.. ప్రసాధ సామాగ్రిని మాయం చేసిన సిబ్బంది!
Basara Temple
Anand T
|

Updated on: Oct 19, 2026 | 11:02 PM

Share

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో చోరీ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న మూల నక్షత్రం సందర్భంగా భక్తులు కోసం లడ్డూ, పులిహోర తయారీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే.. ప్రసాదాల తయారీ కోసం 15వ తేదీ సాయంత్రం ఆలయంలోని స్టోర్ నుంచి కావాల్సిన సరుకులు తీసి బయట ఉంచారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు ఇంటి దొంగలు. ఈ సరుకుల్లోని కొన్నింటిని ఆటోలో తరలించి బయట వ్యక్తులకు విక్రయించారు.

అయితే ఈ సరుకుల చోరికి సంబంధించి దృశ్యాలన్నీ ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ దృశ్యాలను గుర్తించిన టెక్నికల్‌ టీమ్‌.. ఈ విషయాన్ని వెంటనే బాసర ఆలయ ఈవో అంజనాదేవికి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ప్రసాదం సరుకుల చోరీ జరిగినట్టు గుర్తించి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ గోల్‌మాల్‌లో ఒక పర్మినెంట్ ఎంప్లాయ్.. మరొకరు తాత్కాలిక ఉద్యోగి ఉన్నట్టు తేల్చారు. తాత్కాలిక ఉద్యోగిని ఏజెన్సీకి సరెండర్ చేయగా.. స్టోర్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న పర్మినెంట్ ఉద్యోగికి ఘటనపై వివరణ కోసం నోటీసులు ఇచ్చారు.

ఉద్యోగి వివరణ తర్వాత శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆలయ ఈవో అంజనాదేవి. అలాగే సరుకుల చోరీని గుర్తించిన టెక్నికల్‌ టీమ్‌ సభ్యులను ఈవో అంజనాదేవి అభినందించారు. అయితే.. ఇలాంటి ఘటనలు ఇప్పుడే జరిగాయా?.. గతంలో ఏమైనా చోటుచేసుకున్నాయా?.. అనే దానిపై విచారణ చేయనున్నట్టు ఈవో అంజనాదేవి ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us